Begin typing your search above and press return to search.
పసికందుకు సజీవదహనం చేసిన అమ్మ.. అమ్మమ్మ
By: Tupaki Desk | 10 Sep 2020 9:10 AM GMTకొన్ని దారుణాలకు సంబంధించిన వివరాలు విన్నంతనే.. వణుకు పుట్టేస్తుంది. అప్రయత్నంగా కళ్లల్లో కన్నీటి చెమ్మ తిరుగుతుంది.తమ తప్పేం లేకున్నా.. దారుణ శిక్షను అనుభవించే ఉదంతాలతో మనసు చేదుగా మారుతుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. మనషుల్లో ఉండే సహజమైన మానవత్వం మొత్తం ఇరిగిపోయి.. రాక్షసుల కంటే దారుణంగా వ్యవహరించిన వైనం తెన్ కాశి జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతకీ అసలేం జరిగిందంటే?
జిల్లాకు చెందిన శంకరన్కోయిల్ రైల్వే కాలనీలో ఉదయాన్నే వాకింగ్ వెళ్లిన వారికి.. ఏదో కాలిన వాసన ఘాటుగా రావటంతో.. అటుగా వెళ్లిన వారు షాక్ కు గురయ్యారు. నాలుగు రోజుల పసికందును సజీవ దహనం చేసిన వైనాన్ని గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు లెక్కలు తేల్చారు. అదే రైల్వే కాలనీకి చెందిన గోమతి అనే మహిళ వివాహం కాకుండానే ఒక వ్యక్తి కారణంగా గర్భవతి అయ్యింది. అబార్షన్ కు ప్రయత్నించారు. గడువు మించిపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డను కనాల్సి వచ్చింది.
బిడ్డ పుట్టిన నాలుగో రోజున అక్రమ సంతానం తమకు వద్దని భావించిన గోమతి.. ఆమె తల్లి ఇద్దరు కలిసి ఆ పసికందును సజీవ దహనం చేశారు. అయితే.. వాకింగ్ కు వెళ్లిన వారి కారణంగా వారి కిరాతకం బయటకు వచ్చింది. ఇంత దారుణానికి పాల్పడిన అమ్మ.. అమ్మమ్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఉదంతం సంచలనంగా మారింది.