Begin typing your search above and press return to search.
పీకలదాకా మద్యం తాగి పడుకున్న తల్లి.. పసిపాప పాలకోసం ఏడ్చీ.. ఏడ్చీ..
By: Tupaki Desk | 29 March 2021 12:30 AM GMTమద్యానికి బానిసై కుటుంబాన్ని గాలికొదిలేసిన మగాళ్లను చూసి ఉంటారు.. కానీ, పసిబిడ్డ పాలకోసం ఏడుస్తున్నా పట్టించుకోలేనంత మత్తులో మునిగిపోయిన తల్లి గురించి విన్నారా? ఆ తల్లి ఛత్తీస్ గఢ్ లో ఉంది. పాలకోసం పసిబిడ్డ గొంతు ఎండిపోయేలా ఏడ్చినప్పటికీ.. ఆ తల్లి మత్తు వదల్లేదు. చివరకు రాత్రంతా ఏడ్చిన ఆ బిడ్డ.. అలాగే కన్నుమూసింది. ఈ దారుణ సంఘటన ఛత్తీస్ గఢ్ లోని ధమ్ తరీ ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వీరికి నెలన్నర వయసున్న పాప ఉంది. అయితే.. కొన్నాళ్లుగా మద్యానికి బానిసైన పాప తల్లి.. ఒక్క రోజుకూడా మద్యం లేకుండా ఉండలేని స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం భర్త పనిమీద ఊరెళ్లాడు. ఆ రోజు కూడా ఆమె ఫుల్లుగా మద్యం తాగింది.
ఆ తర్వాత ఇంట్లో అలాగే పడుకుంది. ఎంత తాగిందో తెలియదుగానీ.. పాలకోసం పాప ఏడుస్తున్నా వినిపించుకోలేనంత మత్తులోకి జారుకుంది. ఆ విధంగా పాలకోసం రాత్రంతా పాప ఏడ్చి కన్నుమూసింది. అయితే.. తెల్లవారిన తర్వాత కూడా నిద్రలేవలేదు. ఉదయం 9 గంటలు అవుతున్నా.. ఆమె లేవకపోవడంతో చుట్టుపక్కల వాళ్లు వెళ్లి చూశారు. ఆమె మత్తులో ఉండగా.. పాపలో కదలిక లేదు. చివరకు ప్రాణం లేదని గుర్తించారు.
ఈ విషయం చెప్పేందుకు తల్లిని ఎంత కదిపినా లేవలేదు. దీంతో.. స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చిన తర్వాత ఆమె నిద్రలేచింది. అప్పటికీ మత్తులోనే ఉన్న ఆమె.. ఆ తర్వాత రాత్రి ఏం జరిగిందో చెప్పింది. మద్యం మత్తు బిడ్డను పొట్టన పెట్టుకుందని బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.