Begin typing your search above and press return to search.
మొనగాడు వర్సిటీలన్నీ పెద్దన్న ఇలాకాలోనే
By: Tupaki Desk | 7 May 2016 5:48 AM GMTప్రాచీన విద్యావిధానానికి ప్రపంచానికే పాఠాలు చెప్పిన ఘనత మన సొంతం. మనం ఎన్నుకున్న నాయకుల తీరు కారణంగా.. ప్రభుత్వాల పని తీరు పుణ్యమా అని.. దేశ పరపతి ఎంతలా దెబ్బతిన్న విషయం కొన్ని కొన్ని సర్వేలు గుర్తు చేస్తుంటాయి. నలంద.. తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాల గొప్పతనం గురించి ప్రపంచం మొత్తం గొప్పగా చెప్పుకునే నాటి నుంచి.. ప్రపంచంలోని టాప్ వంద వర్సిటీల్లో 130 కోట్ల పైచిలుకు ప్రజలున్న మన దేశంలో ఒక్కటి కూడా లేకపోవటం చూస్తే.. మనం ఎంత వెనుకబడి ఉన్నామో ఇట్టే అర్థమవుతుంది.
తాజాగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ వర్సిటీలకు సంబంధించి ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న వారు ఇచ్చిన అభిప్రాయాల ఆధారంగా ప్రపంచంలోనే అత్యుత్తమ టాప్ టెన్ వర్సిటీల లెక్క ఒకటి తాజాగా బయటకు వచ్చింది. 2015 – 16 ఏడాదికి టాప్ టెన్ వర్సిటీల్లో అగ్రస్థానం ప్రపంచ పెద్దన్న అమెరికాకు దక్కటం గమనార్హం. బ్రిటన్ రెండో స్థానంలో నిలిచింది. అంతేకాదు.. టాప్ వంద విషయానికి వస్తే అమెరికాకు చెందిన 43 వర్సిటీలు చోటు దక్కించుకోవటం గమనార్హం. ఇక.. టాప్ 100లో చోటు దక్కించుకున్న ఆసియా దేశాల వర్సిటీల విషయానికి వస్తే.. 18 విశ్వవిద్యాలయాలకు జాబితాలో చోటు లభించింది. విషాదకరమైన విషయం.. భారత్ కు చెందిన ఒక్క విశ్వవిద్యాలయంలో ఈ జాబితాలో లేదు. గత ఏడాది టాప్ టెన్ స్థానంలో ఉన్న వర్సిటీ ఆఫ్ టోక్యో ఈసారి జాబితాలో 12వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇంతకీ టాప్ టెన్ వర్సిటీలు చూస్తే..
1. హార్వర్డ్ వర్సిటీ (అమెరికా)
2. మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అమెరికా)
3. స్టాన్ ఫర్డ్ వర్సిటీ (అమెరికా)
4. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ (బ్రిటన్)
5. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ (బ్రిటన్)
6. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (అమెరికా)
7. ప్రిన్స్ టన్ యూనివర్సిటీ (అమెరికా)
8. యేల్యూనివర్సిటీ (అమెరికా)
9. కొలంబియా యూనివర్సిటీ (అమెరికా)
10. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అమెరికా)