Begin typing your search above and press return to search.

ప్రపంచంలో అత్యంత రహస్యమైన ప్రదేశం..ఆ లగర్జీ హోటల్లోని ఐదో అంతస్తు!

By:  Tupaki Desk   |   15 Nov 2020 6:45 AM GMT
ప్రపంచంలో అత్యంత రహస్యమైన ప్రదేశం..ఆ లగర్జీ హోటల్లోని ఐదో అంతస్తు!
X
ప్రపంచంలో లగ్జరీ హోటళ్లు లక్షల్లో ఉంటాయి. కానీ.. మరే హోటల్ కు లేని ప్రత్యేకత దాని సొంతం. 47అంతస్తులు ఉండే ఆ హోటల్ లోని ఐదో అంతస్తు మాత్రం యమా సీక్రెట్ గా చెబుతారు. ఆ దేశానికి వెళ్లిన చాలామంది విదేశీ టూరిస్టులు ఆ హోటల్ కు వెళతారు. కానీ.. ఐదో అంతస్తులో మాత్రం ఏముంటుందో తెలుసుకోలేకపోయారు. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడ ఉంది? ఎందుకంత రహస్యంగా ఉంచుతున్నారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడ ఉందంటే?

ఉత్తర కొరియా అన్నంతనే కిమ్ గుర్తుకు వచ్చేస్తాడు. కర్కసత్వానికి నిలువెత్తు రూపంగా.. నియంత అనే పదానికి సరికొత్త అర్థాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన అతడో సీక్రెట్ అని చెప్పాలి. కిమ్ కు సంబంధించిన అంశాలే కాదు.. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారన్న విషయంలోనూ టాప్ సీక్రెట్ అన్నట్లు సాగుతుంటుంది. అలాంటి ఆ దేశంలో యాంగ్గాక్ డో ఇంటర్నేషనల్ హోటల్ ఒకటి ఉంది. దాని ఐదో అంతస్తులో ఏదో ఉందని చెబుతారు.

అందులోని ఎవరినీ అనుమతించకపోవటమే కాదు.. దాని లోపలకు వెళ్లే ప్రయత్నం చేసి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నోళ్లు బోలెడంత మంది ఉన్నారు. అదే సమయంలో ఆ ఐదో అంతస్తు గుట్టు తేల్చటానికి కొందరు సక్సెస్ అయ్యారు. అయితే.. వారి నుంచి బయటకు వచ్చిన సమాచారం కొద్దిగానే ఉందని చెబుతారు.

ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ పరిధిలోని టాయిడాంగ్ నదిలో ఒక ఐల్యాండ్ ఉంది. అందులో యాంగ్గాక్ డో అనే లగ్జరీ హోటల్ ఉంది. 1986లో దీని నిర్మాణం ప్రారంభం కాగా.. 1992లో దీన్ని స్టార్ట్ చేశారు.అందులో 47 అంతస్తులు ఉంటాయి. వెయ్యి గదులు.. నాలుగు రెస్టారెండ్లు.. స్విమ్మింగ్ ఫూల్.. గేమింగ్ జోన్ తదితర సదుపాయాలు ఉన్నాయి.

విదేశీ పర్యాటకులు వస్తే.. ఈ హోటల్ లోనే ఎక్కువగా బస చేస్తుంటారు. అంతా బాగానే ఉన్నా.. ఈ హోటల్ ఐదో అంతస్తులోకి మాత్రం ఎవరిని అనుమతించరు. ఆ మాటకు వస్తే.. లిఫ్టులో ఐదో అంతస్తు అన్న బటనే ఉండకపోవటం గమనార్హం. దీంతో.. కొందరు ఈ సీక్రెట్ సంగతి చూసేందుకు మెట్ల మార్గంలో వెళ్లారు. అక్కడ ఫోటోలు తీసి.. క్షేమంగా బయటపడ్డారు.

వారు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఐదో అంతస్తు రెండు అంతస్తులుగా డివైడ్ చేశారని చెబుతారు. ఒకటి రెండు గదులు మినహా అన్నింటికి తాళాలు ఉన్నాయని.. గోడలపై అమెరికా.. జపాన్ లకు వ్యతిరేకంగా పలు నినాదాలతో కూడిన పోస్టర్లు ఉన్నాయి. అయితే.. అందరు అనుకున్నట్లు ఐదో అంతస్తులో ఏమీ రహస్యం లేదని చెబుతున్నా.. అదే నిజమైతే.. పర్యాటకుల్ని ఎందుకు అనుమతించరన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి. మొత్తంగా.. ప్రపంచంలో అతి రహస్యమైన హోటల్ లో ఇదొకటిగా అభివర్ణించే వారు లేకపోలేదు.