Begin typing your search above and press return to search.

బ్రిట‌న్‌లోనే అత్యంత ఖ‌రీదైన విడాకుల కేసు .. తల్లికి భరణంగా రూ. 750 కోట్లు !

By:  Tupaki Desk   |   27 April 2021 9:32 AM GMT
బ్రిట‌న్‌లోనే అత్యంత ఖ‌రీదైన విడాకుల కేసు .. తల్లికి భరణంగా రూ. 750 కోట్లు !
X
వారి వారి కారణాల దృష్ట్యా విడాకులు తీసుకున్న మహిళకి భరణం అనేది చెల్లించాల్సివుంటుంది. విడాకులు తీసుకున్న తర్వాత మహిళలు ఇబ్బందులు పడకూడదు అనే భావన తో ఈ భరణం ఇవ్వాలని కోర్టులు సూచిస్తాయి. ఒక్కోసారి ఆయా మహిళల డిమాండ్.. ఆ పురుషుల ఆర్ధిక స్థితి.. పరిస్థితులను బట్టి అది కొద్దిగా మారుతుంది. కొద్ది మొత్తం ఎక్కువ ఇవ్వడం జరుగుతూ వస్తుంది. కానీ , ఓ మహిళ భరణంగా ఏకంగా 750 కోట్లు అందుకోబోతుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటి అంటే .. ఆ భరణంఆ మహిళ భర్త కాకుండా ఆమె కొడుకు చెల్లించాలని లండన్ కోర్టు తీర్పు చెప్పడం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. రష్యాకు చెందిన ప్ర‌ముఖ బిలియ‌నీర్ అఖ్మ‌దోవ్‌, తాతియానా దంప‌తులు కొన్నేళ్ల క్రితం వారికీ ఉన్న మనస్పర్దల కారణంగా విడిపోయారు. అప్పుడు వీరిద్ద‌రూ లండ‌న్‌ లో ఉండేవారు. 2016లో వీరు విడాకులు తీసుకున్న స‌మ‌యంలో తాతియానాకు 453 మిలియ‌న్ పౌండ్లు భ‌ర‌ణంగా ఇవ్వాల‌ని లండ‌న్ కోర్టు ఆదేశించింది. కానీ 5 మిలియ‌న్ పౌండ్లు మాత్ర‌మే చెల్లించిన అఖ్మదోవ్‌ ర‌ష్యాకు వెళ్లిపోయాడు. మిగిలిన భ‌ర‌ణం సొమ్ము ఆమె పొంద‌కుండా వాళ్ల పెద్ద కుమారుడు తెమూర్ అడ్డుత‌గిలాడు. త‌న తండ్రికి స‌పోర్ట్‌ గా నిల‌బ‌డి, త‌న త‌ల్లికి ఆస్తి వెళ్ల‌కుండా చేయాల్సిన ప్ర‌య‌త్నాలు చేశాడు. దీంతో త‌న‌కు రావాల్సిన భ‌ర‌ణం సొమ్ము కోసం తాతియానా మ‌రోసారి లండ‌న్‌ కోర్టు మెట్లెక్కింది. త‌న తండ్రికి తెమూర్ లెఫ్టినెంట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ త‌న‌కు రావాల్సిన సొమ్ము రాకుండా చేస్తున్నాడ‌ని కుమారుడిపై దావా వేసింది. అయితే తాను చాలా న‌ష్టాల్లో ఉన్నాన‌ని, లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్‌లో చ‌దివేట‌ప్పుడు ట్రేడింగ్‌లో డ‌బ్బు పెట్టి న‌ష్ట‌పోయాన‌ని తెమూర్ కోర్టులో తెలిపాడు. అయితే , అయన మాటలు నమ్మని లండన్ కోర్టు, తాతియానాకు వెంటనే 750 కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది.