Begin typing your search above and press return to search.
కరోనా వైరస్ ఎలా వ్యాప్తిస్తుందంటే ?
By: Tupaki Desk | 11 April 2020 6:30 AM GMTకరోనా వైరస్ ..ఈ మహమ్మారి ఇప్పుడు యావత్ ప్రపంచానికి నిద్ర అన్నది లేకుండా చేస్తుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా వైరస్ .. ఆ తరువాత ఒక్కో దేశం విస్తరిస్తూ ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలకి వ్యాప్తి చెందింది. అయితే, ఈ కరోనా వైరస్ సరైన వ్యాక్సిన్ ఇంకా కనిపెట్టకపోవడంతో దీని ఉదృతిని ఆపలేకపోతున్నారు. ముఖ్యంగా అమెరికా , ఇటలీ , స్పెయిన్ దేశాలు కరోనాతో అల్లాడిపోతున్నాయి. అసలు ఈ వైరస్ పేరు వింటేనే ఇప్పుడు అందరూ భయంతో వణికిపోతున్నారు.
అయితే , ఈ కరోనా వైరస్ మన కణాలకు ఎలా సోకుతుందో తెలుసా.. బ్రెజిల్ కు చెందిన పలువురు పరిశోధకులు ప్రపంచంలోనే తొలిసారిగా అధిక తీక్షణత కలిగిన ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సాయంతో దీన్ని ఫొటోలు తీశారు. వైరస్ ఎలా సోకుతుంది.. ఎలా శరీరంలో రెట్టింపు అవుతుందనే విషయాలను తెలుసుకునేందుకు బ్రెజిల్ లోని ఒస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ కు చెందిన నిపుణులు కొన్ని పరిశోధనలు జరిపారు. ఈ మైక్రోస్కోప్ సాయంతో ఏదైనా కణాన్ని ఉన్న పరిమాణం కన్నా దాదాపు 20 లక్షల రెట్లు పెద్దగా చూడొచ్చు.
శరీరంలోకి వెళ్లిన వైరస్ కణాలు మొట్ట మొదటగా.. కణ త్వచాన్ని టార్గెట్ చేస్తాయి. కణ త్వచం గుండా కణంలోకి ప్రవేశిస్తుంది. కణంలోకి వెళ్లీ వెళ్లగానే కణంలోని కేంద్రక త్వచం వద్దకు చేరుకుంటుంది. అంటే ఈ సమయంలోనే మనం ఈ వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడతాం. ఆ తర్వాత కణంలో ఉన్న కణ ద్రవ్యంలో వైరస్ వృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. ఈ కణ ద్రవ్యంలోనే వైరస్ తన జన్యువులను అభివృద్ధి చేసుకుంటూ.. శరీరంలోని ఇతర కణాలకు సోకుతుంది. అలాగే ప్రస్తుతం ఈ వైరస్ సూపర్ మర్కెట్స్ లో ఎలా వ్యాప్తి చెందుతుంది అనే దానిపై ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు నిర్వహించారు. దానికి సంబంధించిన 3డీ మోడల్‌ను విడుదల చేశారు. ఓ సూపర్ మార్కెట్లో కరోనా రోగి తుమ్మాడే అనుకోండి.. లేదా దగ్గాడే అనుకోండి.. ఇలా వైరస్ మేఘం లాంటిది ఒకటి గాలిలో కొన్ని నిమిషాల పాటు ఉంటుందని .. అతడు దగ్గిన చోటే కాదు.. ఆ పక్కనున్న రెండు లేయర్ల వరకూ అది వ్యాప్తి చెందుతుందని తెలిపారు.