Begin typing your search above and press return to search.
ఆమెను కలిసిన క్షణం లైఫ్ చేంజింగ్ - విరాట్ కోహ్లి
By: Tupaki Desk | 12 March 2023 8:00 AM GMTఇండియన్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రస్తుతం టీమ్ ఇండియా పరుగుల యంత్రంలా మారిపోయాడు. సచిన్ రికార్డులని కూడా బ్రేక్ చేసే దిశగా తన ఆటతీరుతో దూసుకుపోతున్నాడు. కెప్తెన్సీ వదులుకున్న తర్వాత కొంత కాలం ఆటలో ఇబ్బంది పడిన మరల నిలదొక్కుకొని వరుస సిరీస్ లలో రాణిస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారని అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఇక విరాట్ ఫారిన్ టూర్స్ ఆమెని తీసుకొని వెళ్తే అనుష్క శర్మ కోహ్లిని ఆలయాలకి తీసుకెళ్ళి పూజలు చేయిస్తుంది. భిన్నమైన ఆలోచనలు ఉన్న కూడా మంచి జోడీగా ప్రస్తుతం ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా విరాట్ కోహ్లి ఆర్సీబీ పాడ్ కాస్ట్ తో అనుష్క గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అనుష్క శర్మతో పరిచయం నా జీవితాన్ని మార్చేసింది అని విరాట్ కోహ్లి పేర్కొన్నారు.
తండ్రి దూరమైన తర్వాత తన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. అలాంటి సమయంలో అనుష్క తనకి పరిచయం అయ్యింది. ఆమె కలిసిన క్షణం లైఫ్ చేంజింగ్ మూమెంట్ గా భావిస్తాను.మీరు ఎవరితో అయిన ప్రేమలో పడితే కచ్చితంగా ఆ మార్పులని మీరు గ్రహిస్తారు. ఎందుకంటే జీవితంలో మన భాగస్వామి ఆమె అనుకున్నప్పుడు భవిష్యత్తులో కలిసి ఆమెతో ప్రయాణించాలి కాబట్టి అందుకు తగ్గట్లు మార్పులు మీలో కూడా మొదలవుతాయి.
వాటిని గ్రహిస్తే ఆమె మీ జీవన సహచరి అనే విషయం అర్ధం అవుతుంది అని చెప్పాడు. మొత్తానికి అనుష్క మీద విరాట్ కోహ్లికి ఎంత ప్రేమ ఉంది అనేది ఈ మాటల బట్టి అర్ధమైపోతుంది. అలాగే ఆమెని ఎంతగా ప్రేమిస్తున్నాడో, అంతగా నమ్ముతున్నాడు అని విరాట్ కోహ్లి మాట్లా తర్వాత స్పష్టం అవుతుందని చెప్పొచ్చు. మరి తన భర్త ఇచ్చిన ఈ ప్రశంసపై అనుష్క శర్మ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.