Begin typing your search above and press return to search.
నో టెర్రరిజం.. మోదీ పాలన బాగుంది.. ఇదీ కశ్మీరీల మనోగతం
By: Tupaki Desk | 5 Aug 2019 2:36 PM GMTఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నవారు అక్కడ ప్లెబిసైట్ నిర్వహించలేదన్న వాదనను తెరపైకి తెస్తున్నారు. అక్కడి ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ఇదంతా చేయడం సరికాదంటూ విమర్శలు కురిపిస్తున్నారు. అయితే.. ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనప్పటికీ మీడియా సంస్థలు అక్కడి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాయి. ముఖ్యంగా ‘ఆసియానెట్ న్యూస్’ గత నెలలో చేపట్టిన సర్వే ఫలితాలు కశ్మీర్ ప్రజల మనోభావాలను తెలుపుతోంది.
గత నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్య వారం రోజుల పాటు ఆసియానెట్ న్యూస్ జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా సర్వే చేసింది. ఆ సర్వేలో అనేక ప్రశ్నలు అడిగింది. అందులో 7 కీలక ప్రశ్నలకు జమ్ముకశ్మీర్ ప్రజలు ఏం చెప్పారనేది మా పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.
1) కశ్మీర్ ను వేధిస్తున్న మూడు ప్రధాన సమస్యలేమిటి?
ఈ ప్రశ్నకు సమాధానంగా అందరూ టెర్రరిజాన్ని తొలి సమస్యగా చెప్పారు. సామాజిక అశాంతి, రాజకీయ అవినీతి రెండు, మూడు సమస్యలని చెప్పుకొచ్చారు. మరికొందరు నిరుద్యోగం, విద్యా అవకాశాలు తక్కువగా ఉండడాన్ని రెండు మూడు సమస్యలుగా చెప్పారు. కానీ.. అంతా ఉగ్రవాదమే ప్రధాన సమస్యని చెప్పారు.
2) కశ్మీర్ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోదీ ప్రభుత్వం సఫలమైందా అన్న ప్రశ్నకు 40 శాతం మంది అవునని చెప్పారు. సుమారు అంతే శాతం మంది లేదని చెప్పగా మిగతావారు దీనిపై తమకు స్పష్టత లేదన్నారు. పట్టణ ప్రాంతాలవారు ఎక్కువగా ఉద్యోగ కల్పన విషయంలో మోదీ ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తంచేశారు.
3) మోదీ ప్రభుత్వ హయాంలో కశ్మీర్ లో శాంతి నెలకొందా అన్న ప్రశ్నకు 40 శాతం కంటే ఎక్కువ మంది అవునని చెప్పారు. యువత, పట్టణ ప్రజలు, హిందువులు ఈ విషయంలో మోదీ ప్రభుత్వంపై సంతృప్తి కనబరిచారు.
4) మోదీ ప్రభుత్వంతో సంతృప్తిగా ఉన్నారా అన్న ప్రశ్నకు మిశ్రమ స్పందన కనిపించింది. జమ్ము, లద్దాఖ్ ప్రాంతాలవారు మోదీ పాలనపై సంతృప్తి వ్యక్తంచేయగా... కశ్మీర్ లో వ్యతిరేకత కనిపించింది.
5) ఏ పార్టీని ఎక్కువగా ఇష్టపడతారన్న ప్రశ్నకు.. జమ్ము- లద్ధాక్ వాసులు బీజేపీ పేరు చెప్పగా కశ్మీర్ ప్రాంతీయులు మాత్రం నేషనల్ కాన్పరెన్స్ పేరు చెప్పారు.
6) జాతీయ పార్టీల్లో దేన్ని కోరుకుంటారు?
- ఈ ప్రశ్నకు సమాధానంగా జమ్ము, లద్ధాక్ వాసులు బీజేపీ పేరు చెప్పగా.. కశ్మీరీలు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పారు.
7) జమ్ముకశ్మీర్ ను ఎవరు పాలించాలి.. మోదీ- ఫరూఖ్- ఒమర్- రాహుల్ గాంధీ- మెహబూబా ముఫ్తీ? ఎవరిని కోరుకుంటారు?
- ఈ ప్రశ్నకు సమాధానంగా అత్యధికులు ఫరూఖ్ అబ్దుల్లా పేరు చెప్పగా ఆ తరువాత స్థానంలో ఒమర్ అబ్దుల్లా, మెహబూబాబముఫ్తీ, నరేంద్ర మోదీ పేర్లు చెప్పారు. జమ్ము, లద్ధాక్ లో ఎక్కువ మంది మోదీ పేరు చెప్పారు. రెండు ప్రాంతాల్లోనూ రాహుల్ గాంధీ పేరు అతికొద్ది మందే చెప్పారు.