Begin typing your search above and press return to search.
ఆ మోడల్ ను అంత దారుణంగా చంపారు.. కాళ్లను ఫ్రిజ్ లో దాచేశారు
By: Tupaki Desk | 27 Feb 2023 4:00 PM GMTకట్టలు తెగేంత కోపం.. అంతులేని ఆవేశం.. ఇలాంటి మాటలు తరచూ వింటూనే ఉంటాం. కానీ.. ఇటీవల కాలంలో ఒక వ్యక్తి మీద క్రోధం వికృత రూపంగా మారుతోంది. మరీ.. ఇంత దారుణంగా వ్యవహరించాలా? అన్న భావన కలుగుతోంది. అప్పటివరకు అమితంగా ప్రేమించే వారే.. దారుణాలకు పాల్పడుతున్న వైనం మింగుడుపడనిదిగా మారుతోంది. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి హాంకాంగ్ లో చోటు చేసుకుంది. సంచలనంగా మారిన ఈ మర్డర్ మిస్టరీ ఒక కొలిక్కి రాలేదు. హైప్రొఫైల్ కేసు కావటంతో అక్కడి పోలీసులు ఈ దారుణహత్య లెక్క తేల్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అసలేం జరిగిందంటే..
హాంకాంగ్ కు చెందిన 28 ఏళ్ల అబ్బి చోయి అనే మహిళా మోడల్ దారుణ హత్యకు గురైంది. ఆమె కాళ్లు నగర శివారులోని ఒక ఇంట్లోని ఫ్రిజ్ లో పోలీసులు గుర్తించారు. అదే ఇంట్లో డెడ్ బాడీని కోసేందుకు వినియోగించే ఎలక్ట్రిక్ రంపాన్ని కూడా కనుగొన్నారు. దీంతో.. ఆమె శరీరంలోని మిగిలిన భాగాలు ఎక్కడ ఉన్నాయన్నది ప్రశ్నగా మారింది. కొద్ది కాలం క్రితమే ఆమె ముఖచిత్రం ఎల్ అఫియల్ మొనాకో ఫ్యాషన్ మ్యాగజైన్ డిజిటల్ కవర్ మీద ప్రచురితమైంది. అలాంటి ఆమెను అంత దారుణంగా ఎవరు చంపి ఉంటారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
మోడల్ దారుణ హత్య కేసులో భాగంగా ఆమె మాజీ భర్తను.. అతని సోదరుడిని.. అత్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యకు కారణాలు ఏమిటనన దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఆమెను చివరిసారిగా తాయ్ పీవో జిల్లాలో కనిపించిందని.. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయినట్లుగా తేల్చారు. ఆమె శరీర భాగాల్ని గుర్తించేందుకు వీలుగా అత్యాధునిక డ్రోన్ల సాయంతో వెతుకుతున్నారు. ఆమెను అంత దారుణంగా ఎందుకు వధించారు? ఎవరు చంపేశారు? దాని వెనకున్న కారణాలు ఏమిటి? లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.