Begin typing your search above and press return to search.
కొత్త సచివాలయంలో తొలి భేటీలోనే మంత్రులకు భారీ క్లాస్ తప్పదట
By: Tupaki Desk | 7 May 2023 9:00 PM GMT ముచ్చపడి కట్టించుకున్న సచివాలయం సిద్ధం కావటం.. అంగరంగ వైభవంగా దాన్ని ప్రారంభించటం.. ప్రగతి భవన్.. ఫాం హౌస్ మాదిరి.. తనకు నచ్చిన.. తాను మెచ్చిన వారికి మాత్రమే ఎంట్రీ ఇచ్చేస్తూ కొత్త సంప్రదాయానికి తెర తీశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
సచివాలయం ప్రారంభించిన తర్వాత అయినా రోజు వారీగా ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారా? గడిచిన తొమ్మిదేళ్లుగా పాటించిన విధానాన్నే కంటిన్యూ చేస్తారా? అన్న చర్చల నేపథ్యంలో ఇప్పటివరకు ఆయన రోజువారీగా సచివాలయానికి వస్తున్నది లేదు.
ఇదిలా ఉంటే.. కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు మంత్రి వర్గ సమావేశం జరిగింది లేదు. ఇప్పటివర కు వస్తున్న సమాచారం ప్రకారం సోమవారం కానీ మంగళవారం కానీ కేబినెట్ భేటీ జరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. కొత్త సచివాలయం ఓపెనింగ్ తర్వాత నిర్వహిస్తున్న మొదటి మీటింగ్ ఇదే అవుతుంది. అయితే.. ఈసారి మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు గట్టిగా తలంటు ప్రోగ్రాం ఉంటుందని అంటున్నారు.
కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగే తొలి కేబినెట్ భేటీ మీద మంత్రులుకాసింత ఆసక్తిని వ్యక్తం చేశారు. ఎప్పుడైతే.. ఆయన నుంచి తలంటు ప్రోగ్రాం ఉంటుందన్న అంచనాలు వినిపించటం మొదలైందో అప్పటి నుంచి మంత్రివర్గ సమావేశం ఎలా జరుగుతుందన్న టెన్షన్ పెరిగినట్లు చెబుతున్నారు. ఇంతకీ సీఎంకేసీఆర్ ఏ అంశం మీద క్లాస్ పీకుతారు? అన్న ప్రశ్నకు వస్తున్న సమాధానం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల కాలంలో అవసరం ఉన్నా లేకున్నా ఆంధ్రా గురించి.. ఆంధ్రా ప్రాంతం గురించి.. ఆంధ్రా ప్రభుత్వానికి ఇబ్బంది పడేలా పార్టీ నేతలు మాట్లాడిన వైనంపై గట్టి క్లాస్ ఉంటుందని చెబుతున్నారు. ఆంధ్రా గురించి.. అక్కడి పరిస్థితుల గురించి మాట్లాడేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఉన్నప్పుడు అవసరం లేకుండా పార్టీ మంత్రులు మాట్లాడటం దేనికి అన్నది కేసీఆర్ ప్రశ్న అనిచెబుతున్నారు. అదే జరిగితే.. తొలి సమావేశమే చేదు అనుభవాన్ని మిగులుస్తుందన్న మాట వినిపిస్తోంది.