Begin typing your search above and press return to search.

స్టేజ్​పైనే హెయిర్ క​టింగ్ చేయించుకున్న మంత్రి...ఈ కారణంగానే!

By:  Tupaki Desk   |   13 Sep 2020 5:30 AM GMT
స్టేజ్​పైనే హెయిర్ క​టింగ్ చేయించుకున్న మంత్రి...ఈ  కారణంగానే!
X
ఆయన మధ్యప్రదేశ్​ రాష్ట్రానికి క్యాబినెట్​ మంత్రి.. ఓ అభివృద్ధి కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే ఆ స్టేజీ మీద మంత్రికి ఓ బార్బర్​ హెయిర్​కట్టింగ్​, షేవింగ్​ చేశాడు. దీంతో ఫిదా అయినా ఆ మినిస్టర్​ బార్బర్​కు రూ.60 వేలు గిఫ్ట్​ ఇచ్చాడు. అసలు ఆ మంత్రి స్టేజీమీద ఎందుకు హెయిర్​కట్​ చేయించుకున్నాడు. ఆయనకు సెలూన్​కు వెళ్లే తీరికకూడా లేదా? అంతా బిజీగా ప్రజాసేవ చేస్తున్నాడా? అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి..

మధ్యప్రదేశ్ ఫారెస్ట్ మంత్రి విజయ్ షా.. ఖండ్వా జిల్లా గులైమాల్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ స్టేజీ మీద కూర్చొని స్థానిక పరిస్థితుల గురించి చర్చిస్తున్నారు. ఇంతలో రోహిదాస్​ అనే ఓ బార్బర్​ అక్కడికి వచ్చాడు. తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని.. తనకు కొంత ఆర్థికసాయం చేస్తే.. సెలూన్​ పెట్టుకుంటానంటూ మంత్రిని కోరాడు. దీంతో మంత్రి ‘ఏంటి సెలూన్​ పెట్టుకుంటావా? అందుకు నేను ఆర్థికసాయం చేయాలా? అయితే ముందు నువ్వు హెయిర్​కట్​ ఎలా చేస్తావో నేను చూడాలనుకుంటున్నాను. అని మంత్రి అతడితో అన్నాడు. నాకు ఈ స్టేజీ మీద హెయిర్​కట్, షేవింగ్​ చెయ్యి.. నచ్చితే నీకు ఆర్థికసాయం చేస్తాను’ అని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి .. చేతులకు శానిటైజర్​ రుద్దుకొని.. మాస్కు ధరించి రంగంలోకి దిగాడు. మంత్రికి హెయిర్​కట్, షేవింగ్​ చేశాడు. అనంతరం మంత్రి అతడి కటింగ్​ను మెచ్చుకున్నాడు. వెంటనే రూ. 60వేలు ఆర్థికసాయం చేశాడు. దీంతో ఆ బార్బర్​ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాను ఇక సెలూన్​ ఓపెన్​ చేస్తానని చెప్పాడు రోహిదాస్.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కరోనా సమయంలో చాలా మంది హెయిర్​కటింగ్​ చేయుంచుకొనేందుకు భయపడుతున్నారు. దీంతో సెలూన్లకు గిరాకి తగ్గింది. పలువురు బార్బర్లు రోడ్డున పడ్డారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకొని హెయిర్​కటింగ్​ చేయించుకుంటే కరోనా రాదు. ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించేందుకే తాను స్టేజీమీద ఇలా హెయిర్​కట్టింగ్​ చేయించుకున్నానని చెప్పారు మంత్రి.