Begin typing your search above and press return to search.

భూవివాదంలో మంత్రి తానేటి వనిత

By:  Tupaki Desk   |   21 Nov 2021 3:30 AM GMT
భూవివాదంలో మంత్రి తానేటి వనిత
X
ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో ఎమ్మెల్యేలు, ఎంపీల వ‌ర‌కే ప‌రిమిత‌మైన వివాదాలు.. ఇప్పుడు తొలిసారి మంత్రుల చుట్టూతిరుగుతున్నా యి.ఇప్ప‌టి వ‌ర‌కు దూకుడు మంత్రులుగా పేరున్న వైసీపీ స‌ర్కారు మంత్రుల‌కు ఇప్పుడు భూ వివాదాలు చుట్టుకున్నాయి. నిజానికి అవినీతి ర‌హిత పాల‌న అందిస్తామ‌ని.. వైసీపీ ప్ర‌భుత్వం త‌ర‌చుగా చెబుతోంది. అంతేకాదు.. ఎక్క‌డిక‌క్క‌డ ట్రాన్స‌ప‌రెంట్‌గా వ్య‌వ‌హ‌రిస్తో్ంద‌ని పేర్కొంది. కానీ, తాజాగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కోవూరుకు చెందిన ఎస్సీ సామాజిక‌వ ర్గానికి చెందిన మంత్రి తానేటి వ‌నిత‌.. భూ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో ఒక్క‌సారిగా ఈ విష‌యం.. సంచ‌ల‌నంగా మారింది. వైసీపీ ప్ర‌భుత్వంలో ముగ్గురు మంత్రులు ఉన్నారు.

హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మ‌హిళా సంక్షేమ శాఖ మంత్రి తానేటి వ‌నిత ఉన్నారు. అయితే.. వీరిలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ వివాదాల జోలికి పోలేదు. కేవ‌లం రాజ‌కీయంగానే వారు స‌రిగా ప‌నిచేయ‌ర‌నో.. అధికారం లేద‌నో.. వ్యాఖ్య‌లు వినిపించేవి. కానీ, ఇప్పుడు ఏకంగా తానేటి వ‌నిత‌పై భూ వివాదం చుట్టుకోవ‌డం.. ఇటు పార్టీలోను.. అటు ప్ర‌భుత్వంలోనూ.. మ‌రోవైపు ప్ర‌జ‌ల్లో్నూ సంచ‌ల‌నంగా మారింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో తాడేపల్లి గూడెంలో మంత్రి వనిత, శివానంద మఠానికి మధ్య భూ వివాదం నెలకొంది. గతంలో 25 సెంట్ల భూమిని శివానంద మఠానికి దాతలు ఇచ్చారు.

అదే భూమిలో వ్యాపార సముదాయానికి మంత్రి వనిత శంకుస్థాపన చేశారు. అయితే.. ఈ విష‌యం తెలిసిన బీజేపీ నేత‌లు.. శంకుస్థాపనను అడ్డుకోబోయారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను గ‌ట్టిగానే దీనిపై అడ్డుత‌గిలారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత వివ‌ర‌ణ ఇచ్చారు. 2014లో ఈ స్థలాన్ని కొనుగోలు చేశానని ఆమె చెప్పారు. 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నారు. ఇప్పుడు వచ్చి ఆందోళన చేస్తున్న వారెవరకి దగ్గర డా క్యుమెంట్స్ లేవన్నారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకే ఈ గొడవ చేస్తున్నారని ఆమె అన్నారు. అయితే... డాక్యుమెంట్స్ లేనంత మాత్రాన ఆరోప‌ణ‌లు చేయ‌కూడ‌దా? భూమి త‌న‌దేన‌నే డాక్య‌మెంట్లు ఉన్నాయంటే స‌రిపోతుందా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. మ‌రి ఇక్క‌డితో ఆగుతుందా? లేక‌.. మున్ముందు.. మ‌రింత తీవ్రం అవుతుందా ? చూడాలి.