Begin typing your search above and press return to search.
మంత్రి మీడియాతో మాట్లాడొచ్చు .. కానీ , కండీషన్స్ అప్లై!
By: Tupaki Desk | 18 Feb 2021 10:09 AM GMTగత కొన్ని రోజులుగా ఏపీ ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ , ప్రజాప్రతినిధులు , మంత్రుల మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ మాటల యుద్దం మరింతగా ముదిరిపోయింది. రేషన్ డోర్ డెలివరీ అంశంపై మీడియాతో మాట్లాడుతూ ఎస్ ఈసీ పై, ఎన్నికల కమిషనర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నానిపై ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంక్షలు విధించారు.
దీనిపై మంత్రి కొడాలి నాని కోర్టుకు వెళ్లగా.. విచారణ జరిపిన కోర్టు, గురువారం కీలక ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ పథకాల గురించి కొడాలి నాని మీడియాతో మాట్లాడవచ్చని తెలిపింది. అయితే, ఎస్ఈసీ గురించి కానీ, ఎన్నికల కమిషనర్ గురించి కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియపై కూడా మాట్లాడకూడదని సూచించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. తమ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని పేర్కొంది.
ఈనెల 12న జరిగిన మీడియా సమావేశంలో ఎస్ఈసీపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎస్ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. అదే రోజు ఆయన వివరణ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ను గానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను గానీ దూషించలేదని అందులో పేర్కొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఒకటి రెండు మాటలు అని ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు. కొడాలి నాని ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఎన్నికల కమిషన్ ఆయనపై ఆంక్షలు విధించింది. ఈ నెల 21 వరకూ ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రెస్‌మీట్‌లతో పాటు ఎలాంటి మీటింగ్‌లలో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. దీనిపై కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పలుసార్లు విచారించిన కోర్టు విచారణ అనంతరం మాడియాతో మాట్లాడటానికి మంత్రికి క్లియరెన్స్ ఇచ్చిన కోర్టు.. ఎన్నికల కమిషనర్ పై మాత్రం మాట్లాడొద్దని కండిషన్ పెట్టింది.