Begin typing your search above and press return to search.

కరోనా నుంచి కాపాడే మాస్క్​.. మరోలా మన కొంపముంచుతోంది..

By:  Tupaki Desk   |   22 Oct 2020 5:45 AM GMT
కరోనా నుంచి కాపాడే మాస్క్​.. మరోలా మన కొంపముంచుతోంది..
X
కరోనా సృష్టించిన సంక్షోభంతో ఇప్పటికే ప్రపంచం తలకిందులవుతోంది. అయితే కరోనా నివారణ కోసం మనం పెట్టుకొనే మాస్కులు కూడా భారీగా పర్యావరణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. వైరస్​ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు మాస్కులు పెట్టుకుంటున్నారు. కొంతమంది బట్ట తో తయారు చేసిన మాస్కులు ధరిస్తున్నప్పటికీ.. మెజార్టీ ప్రజలు మెడికల్​ షాపుల్లో దొరికే ఎన్​95 వంటి మాస్కులు వాడుతున్నారు. అయితే సర్జికల్​ మాస్కులు ప్లాస్టిక్ ​తో తయారవుతాయి. దీంతో ఇవి భూమిలో కుళ్లిపోవడం అసాధ్యం.

కరోనా ఆరంభం నుంచి బ్రిటన్‌లో మాస్కులతో 66 వేల టన్నుల కలుషిత వ్యర్థాలు తయారయ్యాయట. మరోవైపు వైరస్‌ అంటుకున్న మాస్కుల వ్యర్థాల వల్ల మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. ఆ వైరస్‌ మట్టిలోకి కూరుకు పోవడం, జల మార్గాల్లో, భూగర్భ జలాల్లో కలిసి పోవడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంటుంది. ప్లాస్టిక్‌ వాడ కూడదనే ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. మాస్కులు మాత్రం ప్లాస్టిక్‌ తోనే తయారు చేస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మాస్కులను తయారు చేస్తున్న దేశం చైనా అక్కడ రోజుకు 11.60 కోట్ల మాస్కులను ఉత్పత్తి చేస్తున్నారట.

మాస్కులు మూడు రకాలున్నాయి. గుడ్డతో చేసినవి, సర్జికల్, ఎన్‌–95 మాస్కులు. గుడ్డతో చేసినవి మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చు. ఇవి భూమిలో కలిసినా కుళ్లిపోతాయి కనుక నష్టం లేదు. ఎన్‌–95 మాస్కులు కూడా శ్రేయస్కరమైనవి. 95 శాతం ఇవి గాలిద్వారా వచ్చే వైరస్‌లను నియంత్రించగలవు. వీటిలో ప్లాస్టిక్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. సర్జికల్​ మాస్కులను ప్లాసిక్​ ఆధారిత పదార్థాలతో తయారు చేస్తారు. వీటివల్ల ఎంతో నష్టం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.