Begin typing your search above and press return to search.

ఐఎస్ రాక్షసులు ఇప్పుడు మరింత పవర్ ఫుల్

By:  Tupaki Desk   |   10 Dec 2015 1:24 PM IST
ఐఎస్ రాక్షసులు ఇప్పుడు మరింత పవర్ ఫుల్
X
తమ రాక్షసకాండతో ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ మరింత ప్రమాదకారిగా మారనుంది. ఇప్పటికే తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తున్న ఈ రాక్షస మూకకు మరింత బలం చేకూరేలా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇస్లామిక్ స్టేట్ కి మద్దుతు ఇచ్చేందుకు దాదాపుగా 42 ఉగ్రవాద సంస్థలు ఓకే చెప్పటం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం.

అమెరికా మొదలు.. యూరప్ లోని పలు దేశాల్లో దారుణాలకు పాల్పడుతున్న ఐఎస్ తో చేతులు కలిపేందుకు పలు ఉగ్రవాద సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయట. దారుణమైన హింసాకాండతో ప్రపంచ దేశాల్ని హడలెత్తిస్తున్నఈ సంస్థతో కలిసి పని చేసేందుకు మరో 42 ఉగ్రసంస్థలు ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరిగి పెద్దది అవుతున్న ఉగ్రవాదానికి సంబంధించి స్టాటిస్టా అనే సంస్థ.. ద ఇండిపెండెంట్ అనే మీడియా సంస్థ కోసం ఐఎస్ బలం ఎంతన్న అంశానికి సంబంధించిన ఒక మ్యాప్ సిద్ధం చేసింది.

ఈ మ్యాప్ లో ఐఎస్ తో కలిసి పని చేసేందుకు.. దాని కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేందుకు ఇప్పటికే 30 ఉగ్రవాద సంస్థలు ఓకే అన్నాయని.. మరో 12 సంస్థలు తమ మద్దుతు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. ఈ వాదనే నిజమైతే.. ఇప్పటికే శక్తివంతంగా ఉన్న ఐఎస్ మరింత శక్తివంతంగా మారటం ఖాయం. అదే జరిగితే.. ప్రపంచంలో మరిన్ని మారణహోమాలు చోటు చేసుకుంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.