Begin typing your search above and press return to search.

ఏపీలో దివీస్ ఇష్యూను సీఎం జగన్ హ్యాండిల్ చేసిన తీరు భేష్

By:  Tupaki Desk   |   20 Dec 2020 7:00 AM GMT
ఏపీలో దివీస్ ఇష్యూను సీఎం జగన్ హ్యాండిల్ చేసిన తీరు భేష్
X
అందరూ చేసే తప్పే.. ఏపీ సర్కారు చేస్తుందన్న అంచనాలు తప్పయ్యాయి. నిజానికి సంక్షోభ సమయాల్లో సర్కారు వ్యవహరించే తీరుతో.. ఆ ప్రభుత్వ సమర్థతతో పాటు.. సీఎం టాలెంట్ ఏమిటో అర్థమవుతుంది. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం దివీస్ ఫార్మా సంస్థ ఏపీలో భారీ కర్మాగారాన్ని నిర్మిస్తుండటం.. దీనిపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.

ఇటీవల పలువురు స్థానికులు నిర్మాణంలో ఉన్న దివీస్ పరిశ్రమపై దాడి చేయటమే కాదు.. నిప్పు అంటించటం.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. ఇలాంటివేళ.. ప్రభుత్వాలన్ని చేసే తప్పుల్నే సీఎం జగన్ చేస్తారని భావించారు. అందుకు భిన్నంగా.. ఈ ఇష్యూను ఆయన డీల్ చేసిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. తాను చెప్పాల్సినవి చెప్పేసి.. మిగిలిన అంశాల్ని మంత్రి గౌతమ్ రెడ్డికి ఫ్రీహ్యాండ్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. జగన్ నమ్మకానికి తగ్గట్లే.. ఈ ఇష్యూను సరైన రీతిలో క్లోజ్ చేసేలా అడుగులు వేస్తున్నారు ఏపీ మంత్రి.

తాజాగా దివీస్ యాజమాన్యం ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. కాలుష్యంపై మత్స్యకారుల అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోవాలని.. వారితో చర్చలు జరపాలన్నారు. పరిశ్రమలలో తప్పనిసరిగా 75 శాతం మంది స్తానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని తేల్చి చెప్పటమే కాదు.. సీఎస్ఆర్ నిధులతో పాటు స్థానికుల క్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాదు.. ఇష్యూ తేలే వరకు ఒక్క ఇటుక కూడా కదపొద్దంటూ విస్పష్ట ఆదేశాలు ఇవ్వటం.. అందుకు తగ్గట్లేపనులు ఆగిపోవటం చాలావరకు మేలు చేస్తుందని చెప్పాలి.

అంతేకాదు..నిరసన చేసి.. దాడికి పాల్పడిన రైతులు.. మత్స్యకారులపై పెట్టిన కేసుల్ని ఉపసంహరణకు దివీస్ ను అంగీకరించేట్లుగా చేశారంటున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలపై తాము సానుకూలంగా ఉన్నట్లుగా దివీస్ సంస్థ డైరెక్టర్ పేర్కొనటం చూస్తే.. ఇక వివాదాస్పద అంశాన్ని మరింత వివాదం కాకుండా.. ఇష్యూను క్లోజ్ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి సమయస్ఫూర్తిని..చొరవను మెచ్చుకోకుండా ఉండలేం.