Begin typing your search above and press return to search.

మొబైల్ మింగిన మనిషి .. ఆ తర్వాత ఏమైందంటే

By:  Tupaki Desk   |   7 Sep 2021 8:31 AM GMT
మొబైల్ మింగిన మనిషి .. ఆ తర్వాత ఏమైందంటే
X
ముఖ్య గమనిక : మీ మొబైల్ కానీ, అలాగే మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు ఎంత అందంగా కనిపించినా కూడా వాటిని తినడం కానీ, నోటితో పట్టుకొని కొరకడం కానీ చేయకండి. అది మీ ప్రాణాలకే ప్రమాదం. ఎలక్ట్రిక్ వస్తువులు మన అవసరం కోసం మాత్రమే వినియోగించాలి.

తాజాగా ప్రిస్టినా లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ 33 ఏళ్ల వ్యక్తి మొత్తం నోకియా 3310 సెల్‌ ఫోన్‌ ను మింగేశాడు. ఆ తర్వాత ప్రాణాలు కాపాడుకోవడానికి వెంటనే శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ ఆపరేషన్ అనేది చాలా క్లిష్టమైంది. కానీ, వైద్య బృందం ఎన్నో సవాళ్లని స్వీకరించి, వాటిని అధికమించి ఆపరేషన్ సక్సెస్ చేశాడు. ఆ వ్యక్తి కొసావోలోని ప్రిస్టినాకు చెందినవాడు. అతను మింగిన ఫోన్ 2000 ల ప్రారంభంలో మాజీ ఫిన్నిష్ కంపెనీ తయారు చేసిన మోడల్, దీనిని 'బ్రిక్' ఫోన్‌ గా పిలుస్తారు.

మొబైల్ మింగిన తర్వాత ఆ వ్యక్తి స్కాన్ చేయించుకున్నప్పుడు, వైద్యులు ఫోన్ అతను జీర్ణించుకోలేనింత పెద్దదిగా ఉందని , ఇది అతని ప్రాణాలకి ముప్పు అని వెల్లడించారు. ఆ తర్వాత రకరకాలుగా ప్రయోగాలు చేసి మొబైల్ ఫోన్ ను బయటకి తీయాలని ప్రయత్నాలు చేశారు. కానీ, అది కుదరలేదు. ఆ తర్వాత చివరగా అతనికి ఆపరేషన్ చేశారు. డాక్టర్ తెల్జా X- రే మరియు ఎండోస్కోపీ చిత్రాలను ఫేస్‌ బుక్‌ లో మరియు ఫేస్‌ బుక్‌ లో షేర్ చేశారు.

మేము అతనిని స్కాన్ చేసినప్పుడు, ఫోన్ మూడు భాగాలుగా విడిపోయిందని మేము గమనించాము అని డాక్టర్ చెప్పారు. మనిషి కడుపులో పేలిపోయే అవకాశం ఉన్నందున బ్యాటరీ ప్రధాన సమస్య అని డాక్టర్చె ప్పాడు. ఫోన్‌ ని మింగాలనే వ్యక్తి ఆలోచన వెనుక కారణం ఇంకా తెలియాల్సి ఉంది. అతని ప్రాణాలకి ముప్పు ఉండటంతో రెండు గంటల వ్యవధిలో పరికరం తీసివేసినందుకు డాక్టర్ మరియు వైద్య బృందానికి అభినందనలు తెలిపారు. గతంలో చాలా మంది ఫోన్‌ లను మింగిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.