Begin typing your search above and press return to search.

అందాన్ని విసిరి దోచుకున్న ముగ్గురు కి‘లేడీ’లు

By:  Tupaki Desk   |   18 Jun 2021 5:30 PM GMT
అందాన్ని విసిరి దోచుకున్న ముగ్గురు కి‘లేడీ’లు
X
అందంగా ఉన్నారు. ఎర్రగా బుర్రగా చూస్తేనే కవ్వించే అందచందాలు వారి సొంతం. ఆ ముగ్గురు నాజూకు కిలేడీలు తాజాగా అమాయకులైన వారిని నగ్నంగా చేసి వారి న్యూడ్ వీడియోలు, ఫొటోలు తీసి నిలువు దోపిడీ చేస్తున్నారు.

కొడుకు విదేశాల్లో ఉండడంతో ఒంటరిగా ఉన్న బాగా డబ్బున్న వృద్ధ వ్యక్తి ఇంటికి ఈ ముగ్గురు వెళ్లారు. మేము మహిళా పోలీసులం అంటూ ఆయన ప్యాంట్ తోపాటు బట్టలు అన్ని పూర్తిగా విప్పించి బెదిరించి ఆయన నగ్న వీడియోలు తీసి రూ.5 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారు.హర్యానాలోని యుమనా పీఎస్ పరిధిలో ఈ దారుణం జరిగింది.

యుమునాలోని న్యూహమీదా కాలనీలో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడి కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు. ఇది తెలుసుకున్న ఓ కిలాడీ లేడి లోపలికి వెళ్లింది. తాను యుమునా పోలీస్ స్టేషన్ లో మహిళా పోలీసుగా ఉద్యోగం చేస్తున్నానని పరిచయం చేసుకుంది. తర్వాత ఆ వ్యక్తితో చనువుగా ఉంటున్నట్టు నటించింది. ప్యాంట్ ఇప్పమని కోరింది.

ప్యాంట్ విప్పి నిలబడ్డ వ్యక్తికి సడెన్ గా షాక్ ఇస్తూ మరో ఇద్దరు కిలాడీ లేడీలు అతడి ఇంట్లోకి వచ్చారు. అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ప్యాంట్ విప్పి ఏమీ చేస్తున్నావ్ అంటూ ఆ ఇద్దరు కిలాడీ లేడీలు ఆయన ముందు నానా హంగామా చేశారు.

ముగ్గురూ మహిళా పోలీసులు అంటూ కిలాడీలు ఆ వ్యక్తిని బెదిరించారు. అతడిని నగ్నంగా తయారు చేసిన ఆ ముగ్గురు మూడు మొబైల్ ఫోన్లలో నగ్న వీడియోలు తీశారు. తర్వాత మాకు రూ.5లక్షలు ఇస్తే వీడియోలు డిలీట్ చేస్తామని.. లేదంటే సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు. నీ కొడుకుకు విదేశాల్లో ఉన్నా పంపిస్తామని భయపెట్టారు.

మొదట ఆ వ్యక్తి నుంచి రూ.50వేలు లాక్కున్న కిలాడీలు ఆ తర్వాత రూ.4.50 లక్షలు ఇవ్వాలని వేధింపులకు గురిచేశారు. దీంతో అతడు యమునా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే యుమనా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా పోలీసులు అందరినీ చూసిన ఆయన తన దగ్గర డబ్బులు తీసుకున్నది వీళ్లు కాదు అని చెప్పాడు. పోలీసులు పక్కా స్కెచ్ వేసి ఆ డబ్బులు తీసుకోవడానికి రావాలని ఆ యువతులకు ఆ వృద్ధుడితో ఫోన్ చేయించారు. డబ్బులు తీసుకోవడానికి ఆశగా వచ్చిన ఆ ముగ్గురు కిలాడీలను యమునా పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలో ఈ వ్యవహారం సంచలనమైంది.