Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్​ వద్దంటున్న మెజార్టీ ఇండియన్స్​...కారణం ఇదే..!

By:  Tupaki Desk   |   15 Dec 2020 6:30 AM GMT
వ్యాక్సిన్​ వద్దంటున్న మెజార్టీ ఇండియన్స్​...కారణం ఇదే..!
X
వ్యాక్సిన్​ అతిత్వరలో ఇండియాకు రాబోతున్నది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్​ దేశాలు వ్యాక్సిన్​ పంపిణీకి అనుమతి ఇచ్చాయి. అయితే వ్యాక్సిన్​ వేయించుకొనేందుకు భారతీయులు ఆసక్తిగా ఉన్నారా? లేదా సైడ్​ఎఫెక్ట్​ వస్తాయని భయపడుతున్నారా? అనే విషయంపై ఓ సర్వే సంస్థ అభిప్రాయసేకరణ చేపట్టింది. అయితే ఈ సర్వేలో షాకింగ్​ నిజాలు బయటపడ్డాయి. మనదేశంలోని మెజార్టీ ప్రజలు వ్యాక్సిన్​ తీసుకొనేందుకు సుముఖంగా లేరట. వాళ్లంతా సైడ్​ ఎఫెక్ట్​ వస్తాయని భయపడుతున్నారట. మరోవైపు ఇంకొంత మంది భిన్నమైన అభిప్రాయాలు కూడా చెప్పారు.

వ్యాక్సిన్​ భారత్​ లో అమ్ముకొని లాభాలు పొందేందుకు విదేశీ సంస్థలు కుట్ర పన్నుతున్నాయని.. కరోనా వ్యాక్సిన్​ ఇప్పుడో బిజినెస్​ డీల్​లా మారిపోయిందని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. భారత్​కు జనవరి లేదా ఫిబ్రవరిలో వ్యాక్సిన్​ వస్తే దాన్ని తీసుకొనేందుకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారంటూ ‘లోకల్​ సర్కిల్స్​’ అనే ఓ సంస్థ సర్వే నిర్వహించింది. అయితే ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 60 శాతంమంది తాము వ్యాక్సిన్​ తీసుకొనేందుకు సిద్ధంగా లేమని చెప్పారట. వ్యాక్సిన్​ సురక్షితం కాదని వారు నమ్మడమే అందుకు కారణం. అయితే వ్యాక్సిన్ల విషయంలో భారతీయులు తొలినుంచి సుముఖం గా లేరు. ఇతర దేశాల కంపెనీలు ఒక భయోత్పాతాన్ని సృష్టించి ఆ తర్వాత వ్యాక్సిన్​ అంటూ బిజినెస్​ మొదలు పెడతారు అంటూ వాదించే వారు మన దేశం లో చాలా మంది ఉన్నారు.

బెంగాల్‌ కు చెందిన ప్రముఖ గ్రామీణ డాక్టర్‌ ప్రబీర్‌ ఛటర్జీ ఈ వ్యాక్సిన్​ పై ఏమన్నారంటే.. ‘ప్రస్తుతం క్లినికల్​ ట్రయల్స్​ సరిగ్గా జరగడం లేదు. చాలా కంపెనీలు క్లినికల్​ ట్రయల్స్​ ను ‘మమ’ అనిపిస్తున్నాయి. ఇది చాలా డేంజర్​. ఒక ఐదారు నెలలు కొద్ది మందికి వ్యాక్సిన్​ ఇచ్చేసి ఇదే సేఫ్​ అని చెబితే ఏ ఎలా’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ముంబైకి చెందిన ప్రజారోగ్య పరిశోధకులు, జర్నలిస్టు సంధ్యా శ్రీనివాసన్‌, చెన్నైకి చెందిన కమ్యూనిటీ మెడిసిన్‌ ఫిజీషియన్‌ విజయ్‌ప్రసాద్‌ గోపి చంద్రన్‌ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. వ్యాక్సిన్​ పంపిణీ, రోగం తీవ్రత తదితర విషయాల్లో ప్రభుత్వాలు ప్రజలను, మీడియాను మోసం చేస్తూ ఉంటాయి.

అందువల్ల ప్రజలు మరింత గందరగోళంలోకి వెళతారు. కాబట్టి ఏదన్నా మహమ్మారి వచ్చినప్పుడు వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని వాళ్లు అభిప్రాయపడ్డారు. మరోవైపు వ్యాక్సిన్​కు అనుకూలంగా మాట్లాడిన వాళ్లు ఉన్నారు. తమిళనాడు మాజీ సీఎం సీ రాజగోపాలాచారి, మరికొందరు రాజకీయప్రముఖులు వ్యాక్సిన్లకు అనుకూలంగా మాట్లాడారు. అయితే ఏది ఏమైనప్పటికీ వ్యాక్సిన్ల భద్రతపై ఓ స్పష్టత వచ్చాక పంపిణీ మొదలుపెట్టడం శ్రేయస్కరం.