Begin typing your search above and press return to search.
బిగుసుకుంటున్న పీఆర్సీ పీఠముడి
By: Tupaki Desk | 14 Dec 2021 5:30 AM GMTఉద్యోగులందరు ఎప్పుడప్పుడా అని ఎదురుచూసిన పీఆర్సీ నివేదిక బయటకొచ్చింది. అయితే ఈ నివేదికలోని వివరాలు చూసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. పీఆర్సీలోని కొన్ని సిఫార్సులు తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటున్నారు.
ముఖ్యంగా భవిష్యత్తులో పీఆర్సీ స్ధానంలో కేంద్ర ప్రభుత్వం పే స్కేళ్ళను మాత్రమే అమలు చేయాలనే డిమాండ్ ను వ్యతిరేకిస్తున్నారు. తమకు కేంద్రం స్కేళ్ళు కాకుండా పీఆర్సీ మాత్రమే కావాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలో హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రత్యేకంగా వచ్చిన ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చేవారు. ఇకపై అలా చెల్లించక్కర్లేదని పీఆర్సీలో సిఫారసు చేశారు. అయితే దీనివల్ల తగ్గిపోయే జీతాన్ని పర్సనల్ పే రూపంలో భర్తీ చేయాలని సూచించింది.
ఇపుడు అమలవుతున్న 27 శాతం ఫిట్మెంట్ కు బదులు కేంద్ర వేతన సిఫారసుల ప్రకారం 14.29 శాతం ఫిట్మెంట్ చాలని ప్రభుత్వ కార్యదర్శి నేతృత్వంలో కమిటి సిఫారసు చేసింది. దీన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
పెంచిన జీతాలు, భత్యాలు 2018, జూలై నుంచి అమలు చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి అమలు చేస్తామని చెబుతోంది. ప్రభుత్వం ఇంటెరిమ్ రిలీఫ్ కింద ఇస్తున్న 27 శాతం కాకుండా తమకు 50 శాతం ఫిట్మెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఐఆర్ 27 శాతం కూడా అవసరం లేదని చీఫ్ సెక్రటరీ కమిటి సిఫారసు చేయటం కాస్త విచిత్రమే. పీఆర్సీ సిఫారసుల కాపీలను తమ చేతికివ్వాలని సంఘాలు డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వమేమో వెబ్ సైట్లో పెట్టి చూసుకోమంది.
ఇలా అనేక అంశాలపై పీఆర్సీ కమిటీ చేసిన సిఫారసులు-చీఫ్ సెక్రటరీ కమిటీ సిఫారసులకు ఉద్యోగ సంఘాల డిమాండ్లకు మధ్య అంతరం ఉంది. సీఎస్ కమిటీ సిఫారసులు రాష్ట్రప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి ప్రకారం జగన్మోహన్ రెడ్డికి సిఫారసు చేసింది.
అందుకనే పీఆర్సీ కమిటి సిఫారసులకు నేతల డిమాండ్లకు మధ్య బాగా అంతరం కనబడుతోంది. ఏదేమైనా ఒకటిరెండుసార్లు నేతలతో చీఫ్ సెక్రటరీ కమిటి సమావేశమైతే చాల అంశాలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. సమావేశాలు జరిగేంతవరకు పీఆర్సీ ముడి బిగుసుకుందనే చెప్పాలి.