Begin typing your search above and press return to search.

రేవంత్ స‌హా కాంగ్రెస్ నేత‌లు మ‌ర్చిపోయిన లాజిక్ ఏంటంటే....

By:  Tupaki Desk   |   22 Jun 2021 3:03 AM GMT
రేవంత్ స‌హా కాంగ్రెస్ నేత‌లు మ‌ర్చిపోయిన లాజిక్ ఏంటంటే....
X
తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీ మూడ్‌ను అర్థం చేసుకోలేక‌పోతున్నారా? గ‌త వారం రోజులుగా కొత్త టీపీసీసీ అధ్యక్ష నియామకానికి సంబంధించిన వ్యవహారంలో జ‌రుగుతున్న హాట్ హాట్ చ‌ర్చ‌ల్లో మ‌న నేత‌లంతా లెక్క‌లు మిస్ అవుతున్నారా? పీసీసీ ఛీఫ్ ప‌ద‌వి కోసం సీరియ‌స్ గా ప్ర‌య‌త్నిస్తున్న రేవంత్ రెడ్డి స‌హా నేత‌లు సైతం వార్ల్లో నిలుస్తున్న తీరుతో కామెడీ అయిపోతున్నారా అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

టీపీసీసీ అధ్యక్షుడిని ఖ‌రారు చేయ‌నున్నారన్న‌ ప్ర‌చారం నేప‌థ్యంలో రేసులో ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, భట్టి విక్రమార్క తదితర నేతలంతా ఢిల్లీలో మకాం వేశారు. రోజులు గడుస్తున్నా కొత్త నేత నియామక ప్రక్రియ పూర్తి కాక‌పోవడంతో ఢిల్లీకి వెళ్లిన నేతలు తిరిగి ఇంటి బాట పట్టారు. అయితే తాజాగా ఢిల్లీ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి పిలుపు వచ్చింది. దీంతో హుటాహుటిన కోమటిరెడ్డి ఢిల్లీ బయలుదేరారు. దీంతో మ‌ళ్లీ చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, కాంగ్రెస్ నిర్ణాయ‌క శ‌క్తి అయిన సోనియా గాంధీ ఈ విష‌యంపై అంత సీరియస్‌గా లేరంటున్నారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శలు, రాష్ట్రాల ఇంచార్జులు, పీసీసీ అధ్యక్షులతో ఈ నెల 24న సోనియా గాంధీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశం సాగనుంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు పార్టీలో సంస్కరణలు జరగాల్సిందేనని పట్టుపడుతున్న నేపథ్యంలో సోనియాగాంధీ పార్టీ క్యాడర్ తో సమావేశం కావడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంత ముఖ్య‌మైన స‌మావేశం నేప‌థ్యంలో రాష్ట్ర నాయ‌క‌త్వం గురించి చ‌ర్చిస్తూ ఉంటారా? అన్న అనుమానం వ‌స్తోంది. ఈ లాజిక్ మ‌న నేత‌లు మిస్ అయ్యార‌నే కామెంట్ కూడా వినిపిస్తోంది.