Begin typing your search above and press return to search.
టీడీపీ సీఎం ల లిస్ట్ పెరిగిపోతోంది....?
By: Tupaki Desk | 9 Dec 2021 12:30 PM GMTతెలుగుదేశం పార్టీ పెట్టాక ఇప్పటికి ముగ్గురు మాత్రమే ఆ పార్టీ తరఫున సీఎం లుగా పనిచేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీయార్ తొలిసారిగా పాలిస్తే, మధ్యలో నెల రోజుల పాటు నాదెండ్ల భాస్కర రావు, ఇక చంద్రబాబు టీడీపీ సీఎం లుగా కనిపిస్తారు. బాబు ఏలుబడిలో టీడీపీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అన్న చర్చ ఎపుడూ రాలేదు, కానీ 2019 తరువాత మాత్రం టీడీపీలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
పార్టీ సైతం అనుకున్నంతగా పుంజుకోకపోవడంతో టీడీపీ నాయకత్వం మీద సందేహాలు కూడా ఏర్పడ్డాయి. చంద్రబాబు సీఎం అంటే జనాలకు కొత్త దనం ఏమీలేదు అన్న విశ్లేషణ కూడా ఉంది. ఆయన్ని ఇప్పటికి మూడు సార్లు జనాలు చూసేశారు. ఆయన విధానాలు పాలన ఏంటి అన్నది జనాలకు బాగా ఎరుకే.
అయితే చంద్రబాబు తాను మారానని ప్రతీ ఎన్నిక ముందూ అంటారు, కానీ ఒకసారి అధికారం చేతిలో పడ్డాక ఆయన రోటీన్ టైప్ రూలింగ్ నే చూపిస్తారు. ఇది జనాలకే కాదు, టీడీపీ జనాలకు కూడా బాగా అర్ధమైపోయిన విషయం. కాలానికి తగినట్లుగా ప్రతీ పార్టీలో మార్పులు చేర్పులూ జరుగుతాయి.
ఉత్తరప్రదేశ్ లో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న సమాజ్ వాదీ పార్టీలో ములాయం సింగ్ తరువాత ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ పగ్గాలు అందుకున్నారు. ఒక అయిదేళ్ల పాటు సీఎం గా పనిచేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన సీఎం అభ్యర్ధిగా ఉన్నారు. దాంతో జనాలు కూడా ఆ పార్టీ వైపు చూసే అవకాశం ఉంది.
ఎపుడూ ఒకే నాయకుడు అంటే క్యాడర్ కే కాదు, ఓటర్లకు కూడా బోర్ కొడుతుంది. కానీ టీడీపీలో మాత్రం చంద్రబాబు తప్ప మరో ఆల్టర్నేషన్ లేకుండా పోయింది. అప్పటికి చంద్రబాబు కుమారుడు లోకేష్ ని హైలెట్ చేయాలని చూస్తున్నా ఎందుకో అది వర్కౌట్ కావడంలేదు. లోకేష్ అన్న మాట అంటే చంద్రబాబే నయం అని క్యాడర్ కూడా అటు నుంచి ఇటు సర్దుకునే సీన్ కనిపిస్తోంది.
ఇవనీ పక్కన పెడితే టీడీపీలో ఇపుడు కాబోయే సీఎం అంటూ మరికొన్ని పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో ఒక పేరు అయితే బాబుకు బావమరిది కమ్ వియ్యకుండు అయిన బాలయ్యది. బాలయ్య అఖండ బ్లాక్ బస్టర్ కావడంతో ఆయన మీద పందెం కాసేందుకు ఎన్నారై టీడీపీ ఫ్యాన్స్ రెడీ అంటున్నారు.
బాలయ్యను సీఎం గా ఫోకస్ చేస్తే టీడీపీకి గెలిచే చాన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నది ఎన్నారైల మాటగా ఉంది. వారు అఖండ మూవీని తమ భుజాల మీద మోస్తూ ఓవర్సీస్ లో భారీ హిట్ టాక్ తీసుకువచ్చారు. వారందరి మాట ఎలా ఉంది అంటే బాలయ్య ఎన్టీయార్ బ్లడ్. పైగా నందమూరి రాజసం ఆయనలో ఉంది. సగటు జనాలు టీడీపీ వైపు అట్రాక్ట్ కావాలీ అంటే బాలయ్యే బెస్ట్ చాయిస్ అన్నది వారి వాదన. చంద్రబాబు పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి బాలయ్యని సీఎం అభ్యర్ధిగా ముందు పెడితే కచ్చితంగా పార్టీ గెలిచి తీరుతుంది అన్న వారు ఉన్నారు.
ఇపుడు ట్రిపుల్ ఆర్ ట్రైలర్ రిలీజ్ తోనే మరో సీఎం అభ్యర్ధి కూడా రెడీ అయిపోయాడు. ఆయనే జూనియర్ ఎన్టీయార్. ఈ ట్రైలర్ ని చూస్తూ రెచ్చిపోయిన జూనియర్ ఫ్యాన్స్ కాబోయే సీఎం అంటూ ఏపీ రాజకీయ రాజధాని విజయవాడ నడిబొడ్డున రీ సౌండ్ చేస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీకి జూనియరే ఆశాకిరణం అని వారు నినదిస్తున్నారు.
టీడీపీ కి ఎప్పటికైనా జూనియరే నాయకత్వం వహిస్తాడని, ఆయనే ఫ్యూచర్ సీఎం అని ఫ్యాన్స్ గట్టిగానే గోల చేస్తున్నారు. నిజానికి ఇది మొదటి సారి కాదు కుప్పంతో మొదలుపెట్టి క్రిష్ణా జిల్లా దాకా జూనియర్ కే టీడీపీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఆయన ఫ్యాన్స్ చేస్తున్నారు.
మొత్తానికి చూస్తే టీడీపీలో చంద్రబాబు తప్పుకోవాలని బయటకు నేరుగా చెప్పకపోయినా అటు బాలయ్య, ఇటు జూనియర్ ఫ్యాన్స్ మాత్రం తన హీరోలను సీఎం లు గా చూడాలని తెగ ఉబలాటపడుతున్నారు. మరి దీని మీద టీడీపీ అధినాయకత్వం రియాక్షన్ ఎలా ఉంటుందో మరి.