Begin typing your search above and press return to search.

అధికారం తెచ్చిన సెగ‌.. వైసీపీలో మంట‌లు..!

By:  Tupaki Desk   |   1 Jun 2023 7:00 AM GMT
అధికారం తెచ్చిన సెగ‌.. వైసీపీలో మంట‌లు..!
X
ఏపీ లో వైసీపీ అధికారంలో కి వ‌చ్చి నాలుగేళ్ల కాలం పూర్త‌యింది. 2019 మే, 30వ తేదీన విజ‌య‌వాడ వేదిక‌గా.. 151 సీట్ల‌ తో వైసీపీ అధికారం ద‌క్కించుకుంది. అయితే.. ఈ నాలుగేళ్ల‌లో అధికారం ద‌క్కించుకుంద‌న్న ఆనందం ఉందో లేదో తెలియ‌దు కానీ.. పార్టీ ప‌రంగా వైసీపీ చాలానే న‌ష్ట‌పోయింద‌ని అంటున్నారు ప‌రిశీ ల‌కులు. కీల‌క నాయ‌కులు ఎడ‌మొహం పెడ‌మొహంగా మారిపోయారు. అంతేకాదు.. చాలా మంది పార్టీకి దూరంగా ఉంటున్నారు.

వాస్త‌వానికి తొలి సంవ‌త్స‌రం పూర్తి చేసుకున్న‌ప్పుడు.. రాష్ట్ర‌వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు సంబ‌రాలు చేసు కున్నారు. ఊరూవాడా జ‌గ‌న్ చిత్ర‌ప‌టాల‌ కు పాలాభిషేకం చేశారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి నృత్యాలు చేసుకున్నారు. కానీ, ఈ నాలుగేళ్ల త‌ర్వాత‌.. అంటే.. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న‌ త‌ర్వాత‌.. ఆ త‌ర‌హా సంబ‌రాలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. క‌నీసం ట్వీట్ల‌ రూపం లోనూ.. సోష‌ల్ మీడియాలోనూ కూడా.. వైసీపీ కి అనుకూలంగా నాయ‌కులు రెస్పాండ్ కావ‌డం లేదు.

నిజానికి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత 98.44 శాతం ప‌థ‌కాలు అమ‌లు చేశామ‌ని.. మేనిఫెస్టో లో చెప్పిన‌వి చెప్పిన‌ట్టు చేశామ‌ని చెబుతున్న వైసీపీ కి అనుకూలంగా ప్ర‌జ‌ల నుంచి కూడా స్పంద‌న రావాలి. కానీ, అది కూడా క‌నిపించ‌డం లేదు. మ‌రి దీనికి కార‌ణం.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ నేత‌ల మ‌ధ్య ఏర్ప‌డిన‌.. వివాదాలు.. విభేదాలు.. కీచులాటలు అంటున్నారు ప‌రిశీల‌కులు. వీటిని ప‌రిశీలించి.. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించాల్సిన పార్టీ అధిష్టానం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఉదాహ‌ర‌ణ‌ కు కీల‌క నేత‌లు సాయిరెడ్డి దూర‌మయ్యారు. ఇక‌, ఇత‌ర నేత‌లు కూడా..ప‌ద‌వులు ద‌క్క‌లేద‌ని.. ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని వ‌గ‌రుస్తున్నారు. దీంతో వైసీపీ లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. అధిష్టానం పై ఆగ్ర‌హావేశాలు కూడా పెరిగిపోయాయి. ఇక‌, స‌ర్పంచులుగా ఉన్న వైసీపీ మ‌ద్ద‌తు దారులు గ్రామీణ స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. త‌మ‌కునిధులు ఇవ్వ‌క‌పోగా..కేంద్రం ఇచ్చిన వాటిని కూడా వాడేసుకుంటున్నార‌ని వారు చెబుతున్నారు. వెర‌సి నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో వైసీపీ న‌ష్ట‌పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది.