Begin typing your search above and press return to search.

2 కేసులకు ఆ లాయర్ ఫీజు రూ.217 కోట్లు.. కక్కుర్తి ఏమంటే?

By:  Tupaki Desk   |   16 Oct 2020 9:15 AM GMT
2 కేసులకు ఆ లాయర్ ఫీజు రూ.217 కోట్లు.. కక్కుర్తి ఏమంటే?
X
కక్కుర్తికి పరాకాష్ఠగా ఈ ఉదంతాన్ని చెప్పాలి. కేవలం రెండు కేసుల్లో వాదించేందుకు ఛండీగఢ్ కు చెందిన ఒక లాయర్ కు అందిన మొత్తం ఎంతో తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం అడిగితే ఏ ఒక్కరు కనీసం అంచనా కూడా వేయలేరు. అంత భారీగా లాయర్ ఫీజు వసూలు చేస్తున్న వేళ.. దానికికట్టాల్సిన ఆదాయపన్ను కడితే పోయే దానికి.. కక్కుర్తికి పోయి అడ్డంగాబుక్ అయిన ఉదంతం తాజాగా బయటకు వచ్చింది.

తాను వాదించే కేసులకు కోట్లాది రూపాయిల్ని ఫీజుల రూపంలో వసూలు చేసే ఒక ప్రముఖ న్యాయవాది ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. రెండు కేసులకు సంబంధించి ఫీజు రూపంలో రూ.217 కోట్లు వసూలు చేయటమే కాదు.. ఆ భారీ మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్నారు. అతగాడ్నితాజాగా ఐటీ అధికారులకు చిక్కారు. ప్రస్తుతానికి ఈ ప్రముఖ లాయర్ పేరును బయటపెట్టలేదు. ఐటీ శాఖ అధికారులసమాచారం ప్రకారం.. ఛండీగఢ్ కు చెందిన ఒక ప్రముఖ లాయర్.. రెండు కేసులకు సంబంధించి వందల కోట్ల మొత్తాన్నిఫీజు రూపంలో తీసుకున్నారు.

రూ.217 కోట్ల భారీ మొత్తాన్ని క్యాష్ రూపంలో తీసుకున్న సదరు లాయర్ కు చెందిన ఆస్తులపై తాజాగా ఐటీ అధికారులు దాడులునిర్వహించారు. హర్యానా.. ఢిల్లీ ప్రాంతాల్లోని 38ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.ఈ సందర్భంగా రూ.5.5 కోట్ల నగదును జఫ్తుచేశారు. పేరు బయటకు రాని ఈ లాయర్ ఒక కేసులో తన క్లయింట్ నుంచి నగదు రూపంలో రూ.117 కోట్ల మొత్తాన్ని తీసుకున్నారని.. రికార్డుల్లో మాత్రం చెక్కు ద్వారా రూ21 కోట్లు మాత్రమే చూపించినట్లుగా గుర్తించారు.

అంతేకదు.. మరో కేసులో ప్రభుత్వ రంగ సంస్థతో మధ్యవర్తిత్వం చేసేందుకు ఒక ఇంజనీరింగ్ కంపెనీ నుంచి రూ.100 కోట్ల మొత్తాన్ని నగదు రూపంలో స్వీకరించినట్లుగా గుర్తించారు. ఒక లాయర్ నుంచి ఇంత భారీ పన్ను ఎగవేత మొత్తాన్ని గుర్తించటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఇతగాడు తాను సంపాదించిన సంపాదనతో భారీగా భూములు.. స్కూళ్లు కొనుగోలు చేస్తారని చెబుతున్నారు. ఇంతకీ.. ఆ న్యావాది పేరు ఏమిటంటే మాత్రం.. అదొక్కటి మాత్రం అడగొద్దని తాము చెప్పలేమంటున్నారు ఆదాయపన్నుఅధికారులు.