Begin typing your search above and press return to search.

3 దిగ్గజాలు కలిశాయి.. పాస్ వర్డ్ కు ప్రత్యామ్నాయంగా సరికొత్త సాంకేతికత

By:  Tupaki Desk   |   10 May 2022 5:37 AM GMT
3 దిగ్గజాలు కలిశాయి.. పాస్ వర్డ్ కు ప్రత్యామ్నాయంగా సరికొత్త సాంకేతికత
X
డిజిటల్ యుగంలో బలం.. బలహీనత రెండు పాస్ వర్డ్ లే. బలమైన పాస్ వర్డ్ పెట్టుకునే వారికి ఫర్లేదు కానీ.. తమకు గుర్తుండేందుకు వీలుగా ఏర్పాటు చేసుకునే పాస్ వర్డ్ తో చాలామంది ఇబ్బందులకు గురవుతుంటారు. డిజిటల్ రంగంలో అతి పెద్ద లోపంగా పాస్ వర్డ్ ను చెబుతారు. అందుకే తరచూ సైబర్ దాడులు జరగటం.. పెద్ద ఎత్తున నష్టాలకు గురి కావటం జరుగుతుంటుంది.

ఇలాంటి లోపానికి చెక్ పెట్టేందుకు వీలుగా మూడు దిగ్గజ కంపెనీలు ఇప్పుడు చేతులు కలిపాయి. పాస్ వర్డ్ కు ప్రత్యామ్నాయంగా సరికొత్త సాంకేతికతను డెవలప్ చేయాలని డిసైడ్ చేశాయి. ఇందులో భాగంగా రానున్న రోజుల్లో పాస్ వర్డ్ కు స్వస్తి పలకాలని నిర్ణయించాయి. ఇంతకీ ఆ మూడు దిగ్గజ కంపెనీలు ఏవంటే 'గూగుల్' 'మైక్రోసాఫ్ట్' 'యాపిల్'.

పాస్ వర్డ్ కు ప్రత్యామ్నాయంగా వాడేలా.. హ్యాకింగ్ కు.. తస్కరణకు వీల్లేని విధంగా యూజర్ పాస్ వర్డ్ లుగా పని చేసేందుకు వీలుగా సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ టెక్నాలజీ పేరు.. "మల్టీ డివైజ్ ఫిడో క్రెడెన్షియల్స్".

ఇందుకోసం గూగుల్.. మైక్రోసాఫ్ట్.. యాపిల్ కంపెనీలు కలిసి పని చేస్తున్నాయి. యూజర్ అథెంటికేషన్ ను మరింత సులువుగా.. సురక్షితంగా చేయటమే దీని ఉద్దేశం. చాలామంది ఒక్కో ఖాతాకు ఒక్కో పాస్ వర్డ్ పెట్టుకోలేక.. అన్నింటికి కలిపి ఒకే పాస్ వర్డ్ పెట్టుకుంటుంటారు. దీంతో.. హ్యాకర్ల పని సులువుగా మారుతోంది.

అందుకే.. పాస్ వర్డ్ కు ప్రత్యామ్నాయంగా సరికొత్తగా తీసుకొస్తున్నఈ సాంకేతికతలో యూజర్లు ఫింగర్ ప్రింట్.. ఫేస్ రికగ్నిషన్.. డివైజ్ పిన్ లాంటి వాటిని అందుబాటులోకి తీసుకురావటం ద్వారా ఎన్నిసార్లు అయినా తమ ఖాతాల్లో లాగిన్ కావొచ్చొని చెబుతున్నారు.

ఈ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తూ.. డివైజ్ ఫిజికల్ ప్రాక్సిమిటీ అంచనా వేస్తూ ఇతరుల ఖాతాలను హ్యాక్ చేయకుండా అడ్డుకుంటుందంటున్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ టెక్నాలజీ వస్తే.. పాస్ వర్డ్ కు ప్రత్యామ్నాయం మారనుందని చెబుతున్నారు.