Begin typing your search above and press return to search.

చైనా జనాభా ఎంత పెరిగిందో చెప్పిన తాజా నివేదిక.. పని చేసేటోళ్లు అంతమంది!

By:  Tupaki Desk   |   12 May 2021 4:32 AM GMT
చైనా జనాభా ఎంత పెరిగిందో చెప్పిన తాజా నివేదిక.. పని చేసేటోళ్లు అంతమంది!
X
పెరిగితే ఆందోళన.. తగ్గితే మరోలాంటి భయం. ఏది ఎక్కువైనా ఇబ్బందన్నట్లుగా కొన్ని ఉంటాయి. దేశాల జనాభా కూడా దీనికి మినహాయింపు కాదు. అదే పనిగా జనాభా పెరిగితే వచ్చే కష్టాలు ఒకలా ఉంటే.. తగ్గే కొద్దీ ఎదురయ్యే ఇబ్బందులు మరోలా ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనా సుపరిచితురాలే. ప్రపంచంలో అత్యధిక రెండో జనాభా ఉన్న దేశంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా చైనా జనాభా ఎంతన్న విషయాన్ని ఒక నివేదిక వెల్లడించింది.

మంగళవారం ఏడో జాతీయ జనగణన వివరాల ప్రకారం.. మకావో.. హాంకాంగ్ మినహా దేశంలోని 31 ప్రావినసులు.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతాలు.. మున్సిపాలిటీలు కలుపుకొని 5.38 శాతం పెరుగుదల రేటుతో 7.2 కోట్ల మేర జనాభా పెరిగినట్లు అంచనా వేశారు. దీంతో.. దేశ మొత్తం జనాభా సుమారు 141.17 కోట్లకు చేరుకున్నట్లుగా భావిస్తున్నారు. గడిచిన పదేళ్లలో తక్కువ పెరుగుదల ఇదేనని చెబుతున్నారు.

ఇక.. చైనా జనాభాలో 60 ఏళ్లకు పైబడిన వారి జనాభా ఈ ఏడాది మరింత పెరిగింది. గత ఏడాది మొత్తం జనాభాలో వీరి సంఖ్య 18.7 శాతం ఉంటే.. తాజాగా 26.4 శాతంగా ఉండనుంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగనుంది. పుట్టే వారి సంఖ్య తక్కువగా ఉండటం.. ఉన్న వారి వయసు పెరగటం లాంటివి దేశానికి సరికొత్త సమస్యల్ని తెచ్చి పెడుతున్నాయి.

చైనాలో పని చేసే సామర్థ్యం ఉన్న 16-59 ఏళ్ల మధ్య వారు 88 కోట్లుగా లెక్క కట్టారు. జనాభా సగటు వయసు 38.8 కాగా.. ఏడాదిలో సరాసరి పెరుగుతున్న జనాభా పెరుగుదల శాతం 0.53 శాతంగా నమోదైంది. జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు ఒక సంతానం పాలసీని కఠినంగా అమలు చేసింది. దీంతో జనాభా పెరుగుదల శాతం తగ్గుముఖం పట్టింది. 2016లో ఒకే సంతానం పాలసీని ఆ దేశ కమ్యునిస్టు ప్రభుత్వం సడలించటంతో కొంత మార్పు వస్తోంది.