Begin typing your search above and press return to search.
కరోనా నుంచి దేశం రికవరీ.. జీఎస్టీ తాజా వసూళ్లు ఏం చెబుతున్నాయి?
By: Tupaki Desk | 2 Oct 2021 8:32 AM GMTదేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ప్రజల ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే.. ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయాన్ని అనుసరించి ఇట్టే చెప్పేయొచ్చు. ఈ లెక్కన చూస్తే.. తాజాగా జీఎస్టీ వసూళ్ల వివరాలు వెల్లడయ్యాయి.గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే.. ఈ ఏడాది అదే కాలానికి సంబంధించిన జీఎస్టీ వసూళ్లలో పెరుగుదల కొట్టొచ్చినట్లుగా కనిపించిందని చెప్పాలి.
తాజాగా జీఎస్టీ వసూళ్లు సెప్టెంబరు ఒక్క నెలలో లక్ష కోట్ల మార్కును దాటేయటమేకాదు.. ఏకంగా రూ.1,17,010 కోట్లకు చేరటం గమనార్హం. గత ఏడాది ఇదే నెలలో వసూలైన పన్ను ఆదాయంతో పోలిస్తే దాదాపు 23 శాతం పెరుగుదల కనిపించటం విశేషం. సీజీఎస్టీ రూ.20,578 కోట్లు.. ఎస్ జీఎస్టీ రూ.26,767 కోట్లు.. ఐజీఎస్టీ రూ.60,911 కోట్లు.. సెస్ రూ.8754 కోట్లుగా ఉన్నట్లు చెబుతున్నారు.
దీంతో రెండో త్రైమాసికంలో ఇప్పటివరకు సగటున నెలకు రూ.1.15 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు చెప్పాలి. మొదటి త్రైమాసికంతో పోలిస్తే.. ఇది ఐదు శాతం ఎక్కువగా చెప్పాలి. ఇక.. ఈ పన్ను వసూళ్లకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదాయాన్ని చూస్తే.. తెలంగాణ 25 శాతం పెరుగుదలను.. ఆంధ్రప్రదేశ్ 21 శాతం పెరుగుదలను నమోదుచేసినట్లుగా చెప్పాలి.
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి పెరుగుదల 20 శాతం ఉండటం గమానార్హం. మొత్తంగా చూస్తే.. కరోనా పడగ నీడ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకోవటమే కాదు.. రికవరీ మూడ్ లోకి వస్తున్నట్లుగా చెప్పాలి. ఇక రకంగా ఇదో శుభసూచకంగా చెప్పక తప్పదు. సెప్టెంబరుతో పోలిస్తే ఈ అక్టోబరులో మరింత ఎక్కువగా జీఎస్టీ ఆదాయం లభిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. పండుగ సీజన్ కావటంతో పెద్ద ఎత్తున కొనుగోళ్లు ఖాయమని.. దీంతో పన్ను ఆదాయం భారీగా లభిస్తుందని ప్రభుత్వ విభాగాలు అంచనా వేస్తున్నాయి. మరెంత ఎక్కువగా వసూళ్లు ఉంటాయో చూడాలి.