Begin typing your search above and press return to search.

అమెరికాలో ఎగ‌ర‌నున్న అతిపెద్ద మువ్వెన్నల జెండా

By:  Tupaki Desk   |   12 Aug 2021 10:30 AM GMT
అమెరికాలో ఎగ‌ర‌నున్న అతిపెద్ద మువ్వెన్నల జెండా
X
అమెరికాలోని భార‌తీయులు మ‌న దేశ 75వ స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని అతి పెద్ద త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగ‌రేయ‌నున్నారు. న్యూయార్క్‌ లోని ప్ర‌ఖ్యాత టైమ్ స్క్వేర్ ద‌గ్గ‌ర ఈ పంద్రాగ‌స్టు నాడు వాళ్లు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. న్యూయార్క్‌, న్యూజెర్సీ, క‌నెక్టిక‌ట్‌ల‌లోని ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ అసోసియేష‌న్ ఆ రోజు మొత్తం వేడుక‌లు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించింది. 24 గంట‌ల పాటు టైమ్ స్క్వేర్ ద‌గ్గ‌ర ఇండియా డే బిల్‌బోర్డ్‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

ఇక ప్ర‌ఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ త్రివ‌ర్ణాల్లో మెరిసిపోనుంది. ఆ రోజు సాయంత్రం హ‌డ్స‌న్ న‌దిలో క్రూజ్ షిప్‌ పై ప్ర‌త్యేక ఈవెంట్ ఏర్పాటు చేశార‌. దీనికి అక్క‌డి ప్ర‌భుత్వ పెద్ద‌లు కూడా హాజ‌ర‌వుతున్నారు. ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ అసోసియేష‌న్ గ‌తేడాది తొలిసారి టైమ్స్ స్క్వేర్‌లో త్రివ‌ర్ణ ప‌తాకాన్ని రెప‌రెప‌లాడించారు. ఇక నుంచి ఇక్క‌డ ప్ర‌తి ఏటా ఈ వేడుక నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు అసోసియేష‌న్ చైర్మ‌న్ అంకుర్ వైద్య చెప్పారు.

ఈ ఏడాది టైమ్స్ స్క్వేర్‌ లో అతి పెద్ద జెండాను ఎగ‌రేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ జెండా 6 అడుగుల పొడ‌వు, 10 అడుగుల వెడ‌ల్పు ఉండ‌టంతోపాటు 25 అడుగుల ఎత్తున్న జెండా క‌ర్ర‌పై ద‌ర్జాగా ఎగ‌ర‌నుంది. ఈ అతిపెద్ద జెండాను న్యూయార్క్‌లోని కాన్సుల్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా ర‌ణ్‌దీర్ జైశ్వాల్ ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ వేడుక‌లో యంగెస్ట్ గ్రాండ్‌ మాస్ట‌ర్‌, ఇండియ‌న్‌, అమెరిక‌న్ అభిమ‌న్యు మిశ్రా కూడా పాల్గొన‌నున్నాడు. గ‌తంలో కూడా అమెరికాలోని ప‌లు ప్రాంతాల్లో భార‌త స్వాతంత్య్ర దినోత్స వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు అమెరికాలో ఉన్న భార‌తీయులు. ఈ సారి అతిపెద్ద జాతీయ జెండాను కూడా ఎగుర‌వేయ‌నున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌లు దేశాల్లో భార‌త దేశ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తారు.