Begin typing your search above and press return to search.
అతి పెద్ద అరుదైన వజ్రం... ఇది కూడా అక్కడే
By: Tupaki Desk | 18 Jun 2021 11:30 AM GMTప్రపంచంలో ఇప్పటి వరకు కనుగొన్న పెద్ద వజ్రాలు ఎక్కువగా ఆఫ్రికాలో కనుగొన్నారు. 1905 సంవత్సరంలో మొదటి అతి పెద్ద వజ్రంను కనుగొన్నారు. దక్షిణాఫ్రికాలో కనుగొన్న ఈ వజ్రం కు కుల్లినన్ స్టోన్ అని పేరు పెట్టారు. 3106 క్యారెట్లు గా గుర్తించారు. మళ్లీ ఇప్పటి వరకు అంత పెద్ద వజ్రంను కనుగొన్నదే లేదు. 2015 సంవత్సరంలో బోట్స్వానాలో రెండవ అతి పెద్ద వజ్రంను గుర్తించారు. ఆ వజ్రం కు లెసెడి లా రోనా అనే పేరు పెట్టారు. ఆ వజ్రం ప్రపంచంలోనే అతి పెద్ద రెండవ వజ్రంగా రికార్డు దక్కించుకుంది. మరోసారి ఆఫ్రికా లోనే అతి పెద్ద వజ్రం ను కనిపెట్టారు. కొత్తగా కనిపెట్టిన వజ్రం ప్రపంచంలోనే అతి పెద్ద మూడవ వజ్రంగా రికార్డు స్థాదించింది.
ఇంకా పేరు పెట్టని ఈ అతి పెద్ద మూడవ వజ్రంను ఆంగ్లో అమెరికన్ మరియు బీర్స్ ఇంకా స్థానిక ప్రభుత్వం కలిసి జరిపిన తవ్వకాల్లో కనుగొన్నారు. ఈ వజ్రాన్ని డెబ్స్వానా డైమండ్ కంపెనీ వారు స్వాదీనం చేసుకుని ఆ తర్వాత ఆ దేశ అధ్యక్షుడు మోక్వీట్సీ మాసిసీకి అప్పగించారు. మొదటి రెండు ఆఫ్రికా వజ్రాలతో పాటు ఈ మూడవ అతి పెద్ద వజ్రం కూడా ఆఫ్రికాకు చెందినదే అవ్వడం విశేషం.
మూడవ అతి పెద్ద వజ్రం ను 1098 క్యారెట్లుగా గుర్తించారు. దీని పొడవు 73 మి.మి పొడవు కాగా, వెడల్పు 52 మి.మి మందం 27 మి. మి. ప్రభుత్వం మరియు ఈ వజ్రంను కనిపెట్టిన వారు కలిసి చర్చించి ఈ అతి పెద్ద మూడవ వజ్రంకు పేరును ఖరారు చేయబోతున్నారు. కరోనా కారణంగా ఏడాది కాలంగా వజ్రాల అమ్మకం అత్యంత దిగజారి పోయింది. దాంతో వజ్రాల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో అతి పెద్ద మూడవ వజ్రం ను కనిపెట్టిన నేపథ్యంలో వజ్రాల వ్యాపారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ మునుపటి రోజులు వచ్చి వజ్రాల వ్యాపారం పుంజుకుంటుందని కొందరు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.