Begin typing your search above and press return to search.
ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం పెద్ద చనిపోలేదట !
By: Tupaki Desk | 15 Jun 2021 5:30 AM GMTచిన్న కుటుంబం..చింతలేని కుటుంబం. ఈ సామేత పలుసార్లు వినే ఉంటారు. ఎక్కువ సభ్యులు ఉన్న కుటుంబంలో ఆర్థిక సమస్యలు, కుటుంబ భారం ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు. అందుకు తల్లిదండ్రులు వారికి ఇద్దరు పిల్లలు ఇలా చిన్న కుటుంబం ఉండడం వలన సంతోషంగా గడిపేస్తారని అంటుంటారు. ఇక మనదేశంలో ఉమ్మడి కుటుంబాల గురించి తెలిసిందే. పూర్వం రోజుల్లో చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, క్రమంగా తగ్గిపోయాయి. ఒకే చోట ఉండకుండా, వృత్తి, ఉద్యోగాల రీత్యా ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఓ వ్యక్తి కుటుంబం గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అతడిది ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కలిపితే ఒక గ్రామంలో ఉండే ప్రజలకు సమానంగా ఉంటుంది.
మిజోరాంలోని బాట్వాంగ్ గ్రామంలో ఓ కుటుంబం దాదాపు 100 గదులతో కూడిన ఇంట్లో నివసిస్తోంది. ఆ కుటుంబం పెద్ద జియోనా చనా. అతడి వయసు 76 సంవత్సరాలు. అతడికి 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 14 మంది కుమార్తెలు, 33 మంది మనవరాళ్లు , ఒక మనవడు ఉన్నారు. జియోనా వృత్తి రీత్యా వడ్రంగి. ఇదిలా ఉంటే, ఈ కుటుంబంలోని వ్యక్తులందరూ, ఒకరిపై ఒకరు ఆధారపడరు. ఎవరి అవసరాలకు వారే పనులు చేసుకుంటారు. వీరి కుటుంబంలో మొత్తం 181 మంది సభ్యులు ఉన్నారు. కానీ కుటుంబ పోషన, ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బంది పడరు. ఇక వారందరూ కూడా జియోనా ఆదేశాలను కచ్చితంగా పాటిస్తారు. ఇప్పటికీ ఆ కుటుంబం మొత్తం పూర్తి క్రమశిక్షణతో ఉంటారు. 76 ఏళ్ల జియాన్ స్థానిక లాల్పా కోహ్రాన్ ధర్ తెగకు అధిపతి. బీపీ, సుగర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం మరణించినట్లు స్థానిక ట్రినిటీ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం ఆయన శరీరం ఇంకా వెచ్చగానే ఉందని, నాడి కొట్టుకుంటూనే ఉందని చెబుతున్నారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తెచ్చాక ఆయన నాడి తిరిగి కొట్టుకోవడం ఆరంభించిందని తెగ కార్యదర్శి జతిన్ ఖుమా చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులే కాకుండా స్థానికులు సైతం ఈ పరిస్థితుల్లో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధంగా లేము అని తెలిపారు. ఆయన పూర్తిగా మరణించారని తెగ పెద్దలు భావించేవరకు జియాన్ ను పూడ్చిపెట్టేదిలేదన్నారు.