Begin typing your search above and press return to search.

భారత్ కి బయల్దేరిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం .. అందులో ఏమున్నాయంటే ?

By:  Tupaki Desk   |   8 May 2021 4:58 AM GMT
భారత్ కి బయల్దేరిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం  .. అందులో ఏమున్నాయంటే ?
X
గత కొన్ని నెలలుగా మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజవణికిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇలా వైరస్ వెలుగుచూసి ఏడాదిన్నర కావస్తున్నా.. దాని ధాటికి ప్రపంచ దేశాలు ఇప్పటికీ వణికిపోతూనే ఉన్నాయి. మొదట పలు దేశాలు వైరస్‌ను కట్టడి చేయడంలో చాలా విజయవంతంమయ్యాయనే చెప్పాలి. కానీ, మరోసారి మహమ్మారి విరుచుపడుతుండడంతో కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ లో భారత్ అల్లాడిపోతోంది. లక్షల్లో కేసులు నమోదు కావడం , అందరికి ఆక్సిజన్ పెట్టాల్సి రావడంతో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. దీనితో భారత్ ను ఆదుకోవడానికి పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. పలు దేశాలు ఆక్సిజన్ జనరేటర్లు , అలాగే వెంటిలేటర్లు పంపుతున్నాయి.

ఇదిలా ఉంటే .. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం యుకె నుండి ఇండియాకు పయనమైంది. దిగ్గజం అంటోనోవ్ 124 విమానం ఆదివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలో అడుగుపెట్టనుంది. కరోనా వైరస్ సంక్షోభం మధ్య భారతదేశానికి సాయంగా భారీ సామాగ్రిని మోసుకొస్తుంది. కార్గో విమానం అంటోనోవ్ 124 శుక్రవారం ఉత్తర ఐర్లాండ్‌ లోని బెల్ఫాస్ట్ నుండి మూడు 18-టన్నుల ఆక్సిజన్ జనరేటర్లు మరియు 1,000 వెంటిలేటర్లను తీసుకోని ఇండియా కి పయనమైంది. విదేశీ, కామన్వెల్త్ , డెవలప్‌ మెంట్ ఆఫీస్ ఈ సామాగ్రికి నిధులు సమకూర్చింది. ఇక ఆ సామాగ్రి ఇండియా కి చేరగానే రెడ్‌ క్రాస్ వాటిని దేశంలోని వివిధ ఆసుపత్రులకు బదిలీ చేస్తుంది. ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు, ఒక్కొక్కటి నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి, ఒకేసారి 50 మందికి ఉపయోగించడానికి సరిపోతుంది. గత నెలలో 200 వెంటిలేటర్లు మరియు 495 ఆక్సిజన్ జనరేటర్లును ఇప్పటికే యుకె నుండి ఇండియాకి పంపారు.

భార‌త్‌లో క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న‌ కొత్త‌గా 4,01,078 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,18,609 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,18,92,676కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 4,187 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,38,270కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,79,30,960 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 16,73,46,544 మందికి వ్యాక్సిన్లు వేశారు.