Begin typing your search above and press return to search.

పెళ్లి పేరుతో వ్యాపారి నుంచి రూ.11 కోట్లు కొట్టేసిన కి'లేడి'?

By:  Tupaki Desk   |   24 Feb 2021 12:30 PM GMT
పెళ్లి పేరుతో వ్యాపారి నుంచి రూ.11 కోట్లు కొట్టేసిన కిలేడి?
X
పెళ్లి పేరుతో నమ్మించింది.. ఓ వ్యాపారిని బుట్టలో వేసింది. ఏకంగా ఓ వ్యాపారి నుంచి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.11 కోట్ల రూపాయలు కొట్టేసింది. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలైంది.హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జల్సాలకు అలవాటు పడిన ఓ యువతి ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కింది. నకిలీ ఐపీఎస్ అధికారి అవతారమెత్తింది. వీరారెడ్డి అనే వ్యాపారిపై కన్నేసిన ఆ మాయ లేడి తన మాటలతో అతడిని మచ్చిక చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించింది.

అమ్మాయి మాయలో పడిన వ్యాపారి ఆమె అడిగినంత డబ్బు ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా వ్యాపారి నుంచి పలుమార్లు డబ్బు తీసుకుంది లేడి. మొత్తం రూ.11 కోట్లు కాజేసింది.11 కోట్లు చేతికి అందాక ఆమెలో మార్పు వచ్చింది. వీరారెడ్డిని దూరం పెట్టింది. దీంతో మోసపోయానని గ్రహించిన వ్యాపారి లబోదిబోమన్నాడు. పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ కిలేడిని అరెస్ట్ చేశారు.

ఆమె నుంచి రూ.6 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు సహకరించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్ట్ అయిన ఆమె లగ్జరీ జీవితం చూసి పోలీసులకే ఖంగుతిన్నారు. ఈమె చాలా మందిని మోసం చేసిందని తేల్చారు. ఇంకా ఎవరైనా మోసపోయిన వారుంటే సంప్రదించాలని సూచించారు. ప్రేమ, పెళ్లి పేరుతో ఈమోసాలు చేస్తున్నట్టు గ్రహించారు. వ్యాపారి ఏకంగా 11 కోట్లు కట్టబెట్టడం పోలీసులను సైతం షాక్ కు గురిచేసింది.