Begin typing your search above and press return to search.
శబరిమలలో మహిళల ప్రవేశంపై ఆ రూల్ తీసేసిన కేరళ సర్కార్
By: Tupaki Desk | 10 Dec 2020 6:30 AM GMTసర్కారు సాఫీగా సాగిపోతుంటే కొందరు సీఎంలకు అస్సలు నచ్చదేమో? అదేంటి.. ఏ వివాదం లేకుండా సాగటం ఏమిటి? అనుకుంటారేమో కానీ.. భావోద్వేగాల్ని టచ్ చేసే అంశాల్ని పట్టుకొని లేనిపోని తిప్పల్ని తెచ్చి పెట్టుకుంటారు. తాజాగా కేరళ ప్రభుత్వం అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. ఆ మధ్యలో కేరళను ఊపేసిన శబరిమల వివాదాన్ని.. కదిలించిన తాజా వైనం చూస్తే.. నోటి వెంట మాట రాదంతే. కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఈ నిర్ణయం.. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటివరకు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై 2018లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేశ వ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. సుప్రీంతీర్పును అమలు చేయాలని కేరళ ప్రభుత్వం భావించినా.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదిలా ఉంటే.. సుప్రీంతీర్పుపై రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో.. ఈ అంశంపై ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం విచారిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు ఉన్న ఆంక్షల్ని సడలిస్తూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం షాకింగ్ గా మారింది.
కరోనా నేపథ్యంలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం రోజుకు వెయ్యి మందిని మాత్రమే అనుమతించేవారు. తర్వాత దాన్ని 2వేల మందికి పెంచారు. దీనికి సంబంధించిన ఆన్ లైన్ బుకింగ్ లో చోటుచేసుకున్న మార్పు ఇప్పుడు వివాదంగా మారనుంది. ఇప్పటివరకు యాభై ఏళ్లలోపు.. 65 ఏళ్లు దాటినమహిళల ఆలయ ప్రవేశంపై నిషేధం ఉండగా.. డిసెంబరు 8 నుంచి దాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మహిళలను శబరిమల ఆలయ దర్శనం కోసం ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పు తప్పుడు సంకేతాల్ని పంపుతుందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. అయితే.. యాభైఏళ్లలోపు మహిళలను అయ్యప్ప ఆలయ దర్శనం కోసం అనుమతించే వివాదం కాలం చెల్లినిదిగా కొట్టిపారేస్తున్నారు. మరి.. దీనిపై అయ్యప్ప భక్తులు ఎలా రియాక్టు అవుతారన్నది ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.