Begin typing your search above and press return to search.

అక్కడ గణేశ్ ఉత్సవాలకు అర్థరాత్రి వేళ ఓకే చెప్పిన కర్ణాటక హైకోర్టు

By:  Tupaki Desk   |   31 Aug 2022 5:28 AM GMT
అక్కడ గణేశ్ ఉత్సవాలకు అర్థరాత్రి వేళ ఓకే చెప్పిన కర్ణాటక హైకోర్టు
X
కర్ణాటక రాష్ట్రంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అక్కడి హుబ్బళ్లి ఈద్గా మైదానంలో గణేశ్ చతుర్థి ఉత్సవాలను నిర్వహించటానికి వీలుగా రాష్ట్ర హైకోర్టు అర్థరాత్రి వేళ అనుమతి ఇచ్చిన వైనం సంచలనంగా మారింది. గణేశ్ ఉత్సవాల్ని ప్రణాళికబద్దంగా నిర్వహించాలని పేర్కొంది. బెంగళూరులోని ఈద్గా మైదానంలో గణేశ్ చతుర్థి వేడుకల్ని నిర్వహించే అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల్ని జారీ చేసింది.

దీనిపై తాజాగా కర్ణాటక హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను రిజెక్టు చేసింది. ఈద్గా ఆస్తి ధార్వాడ్ మునిసిపాలిటీకి చెందినదని.. అంజుమన్ - ఏ - ఇస్లాం సంస్థకు ఏడాదికి రూపాయి రుసుముతో 999 ఏళ్ల కాలానికి లీజు మాత్రమే ఉన్న విషయాన్ని వెల్లడించింది కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ అశోక్ ఎస్ కినాగి పేర్కొన్నారు. అయితే..

ఈ వాదనను అంజుమన్ ఏ ఇస్లాం కోర్టులో సవాలు చేసింది. ఇదిలా ఉంటే బెంగళూరులోని చామ్ రాజ్ పేట ఈద్గాలో వినాయక చవితి ఉత్సవాల్ని అనుమతించొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఆ కేసులో ఇచ్చిన తీర్పు.. తాజా కేసుకు వర్తించదని పేర్కొంది. చామ్ రాజ్ పేట అంశంలో ఆస్తి యాజమాన్యం వివాదం ఉందని.. హుబ్బళ్లి మైదానం మున్సిపాలిటీకి చెందినదని కావటంతో.. దానికి సంబంధించిన యాజమాన్య హక్కుల విషయంలో ఎవరూ ప్రశ్నించలేరన్నది వాదన. హుబ్బళ్లి మైదానం స్థానిక మున్సిపాలిటీకి సంబంధించినదన్న విషయాన్ని అంజుమన్ ఏ ఇస్లాం కూడా అంగీకరించటాన్ని ప్రస్తావించారు.

బెంగళూరు ఈద్గా మైదానం అంశంలోనూ స్టేటస్ కోనను కొనసాగించాలన్న సుప్రీం ఆదేశించటంతో రాష్ట్ర ప్రభుత్వం జరుపుకోవాల్సిన గణేశ్ చతుర్థి పండుగను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో.. జస్టిస్ కినాగి రాత్రి 10 గంటల వేళలో తన అధికారిక ఛాంబర్ లో ఈ అంశాన్ని విచారించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదితో సహా వివిధ పక్షాల వాదనల్ని విన్న జడ్జి రాత్రి 11.15 గంటల వేళలో.. ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకల్ని నిర్వహించుకోవచ్చని పేర్కొంటూ అనుమతుల్ని జారీ చేసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.