Begin typing your search above and press return to search.

అమెరికాలో 'జ‌గ‌న్ ప‌థ‌కం'.. బైడెన్ సంచ‌ల‌న నిర్ణ‌యం!!

By:  Tupaki Desk   |   25 Feb 2021 5:30 PM GMT
అమెరికాలో జ‌గ‌న్ ప‌థ‌కం.. బైడెన్ సంచ‌ల‌న నిర్ణ‌యం!!
X
అదేంటి అనుకుంటున్నారా? అక్క‌డెక్క‌డో ఉన్న అమెరికాలో ఇక్క‌డి ఏపీలో ఉన్న జ‌గ‌న్ అమలు చేసిన ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డం ఏంటి ? అని నోరెళ్ల బెడుతున్నారా? కానీ.. ఇది ముమ్మాటికీ నిజం. గ‌త ఏడాది క‌రోనా వెలుగు చూసిన త‌ర్వాత‌.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జ‌ర‌గ‌ని విధంగా.. సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఒక‌వైపు క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌జ‌ల‌ను ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని చెబుతూనే.. మ‌రోవైపు.. ప్ర‌తి ఒక్క‌రికీ.. ఆదాయ వ్య‌యాల‌తో, కుల వ‌ర్గాల‌కు అతీతంగా.. మూడేసి చొప్పున మాస్కులు పంపిణీ చేశారు. దీనికి 3.5 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌త్యేకంగా ఖ‌ర్చు చేశారు. ఇది బాగా హిట్ట‌యింది.

ఇప్పుడు అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో అధ్యక్షుడు జో బైడెన్ కూడా జ‌గ‌న్ ఏపీలో అమ‌లు చేసిన ఇదే ప‌థ‌కాన్ని అగ్రారాజ్యంలోనూ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. దేశవ్యాప్తంగా అమెరిక‌న్ల‌తోపాటు ప్ర‌వాసుల‌కు కూడా ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. 2.5 కోట్లకు పైగా మాస్కులను దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. కొవిడ్‌పై పోరులో భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఫుడ్ ప్యాంట్రీలు, సూప్ కిచెన్లలో వీటిని పంపిణీ చేయనున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది.

వైరస్ వ్యాప్తిని నిలువరించడంలో మాస్కులు కీలకమని ఈ సందర్భంగా యూఎస్ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికీ అల్పాదాయ అమెరికన్లు మాస్కులు కొనుగోలు చేయలేకపోతున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని ఈ భారీ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. మా ర్చి నుంచి మే మధ్య ప్రభుత్వం 1300 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 60,000 ఫుడ్ ప్యాంట్రీలు, సూప్ కిచెన్లలో మాస్కుల పంపిణీ చేస్తామని అధ్యక్ష భవనం తెలియజేసింది. కాగా, ఇంతకుముందు ట్రంప్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడదామనుకుని అనుకున్నా.. ఖ‌ర్చు ఎక్కువ‌గా ఉంటుంద‌ని అనుకుని వెనుకడుగు వేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ ప‌రిణామం.. జ‌గ‌న్ స‌ర్కారు చేప‌ట్టిన ప‌థ‌కాన్ని గుర్తు చేయ‌డం విశేషం.