Begin typing your search above and press return to search.

విగ్రహాల ధ్వంసంపై జగన్ సర్కారు కీలక ఆదేశం.. సీఐడీ కాదు సిట్

By:  Tupaki Desk   |   9 Jan 2021 2:55 AM GMT
విగ్రహాల ధ్వంసంపై జగన్ సర్కారు కీలక ఆదేశం.. సీఐడీ కాదు సిట్
X
ఏపీలోని ఆలయాల దేవతామూర్తులు.. విగ్రహాల ధ్వంసం చేస్తున్న ఘటనలు వరుస పెట్టి చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు.. దేవుడితో చెలగాటం వద్దన్న వ్యాఖ్యలు చేశారు. విగ్రహాల ధ్వంసంపై ఏపీ సర్కారు సీరియస్ గా ఉంది. ఇప్పటికే ఈ ఉదంతంపై సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

ఇదిలా ఉండగా.. సీఐడీకి అప్పజెప్పిన విచారణ బాధ్యతను సిట్ కు బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పదహారు మంది సభ్యులతో కూడిన సిట్ ను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి చీఫ్ గా జీవీజీ అశోక్ కుమార్ ను నియమించింది. ప్రస్తుతం ఆయన ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబులను నియమించింది.

ఇదిలా ఉండగా.. రాష్ట్రస్థాయిలో.. జిల్లా స్థాయిలో మత సామరస్యాన్ని కాపాడేందుకు వీలుగా కమిటీల్ని ఏర్పాటు చేయటం.. విధివిధానాల్ని నిర్దేశిస్తూ ఉత్తర్వుల్ని జారీ చేశారు. తాజాగా ఏర్పాటు చేసిన సిట్ పరిధిలోకి.. ఆలయాలు.. దేవతామూర్తుల ధ్వంసానికి సంబంధించిన అన్ని కేసులు ఒక చోటకు చేరి.. విచారణ మరింత వేగంగా సాగేందుకు అవకాశం ఇస్తుందని భావిస్తున్నారు.