Begin typing your search above and press return to search.

వైసీపీ ప్లీన‌రీ ఖ‌ర్చుపై ర‌గ‌డ ర‌గ‌డ‌..!

By:  Tupaki Desk   |   4 July 2022 11:46 PM GMT
వైసీపీ ప్లీన‌రీ ఖ‌ర్చుపై ర‌గ‌డ ర‌గ‌డ‌..!
X
ఏపీ అధికార పార్టీ వైసీపీ త్వ‌ర‌లోనే విజ‌య‌వాడ కేంద్రంగా ప్లీన‌రీ నిర్వ‌హిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టి లో ఉంచుకుని.. ఖ‌చ్చితంగా పార్టీని మ‌రోసారి అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. పెద్ద ఎత్తున దీనిపై ఆశ‌లు పెట్టుకున్నారు. పార్టీని న‌డిపించేందుకు.. దీనిని పెద్ద ఎత్తున వ్యూహా త్మకంగా ఆయ‌న న‌డిపించాల‌ని నిర్ణ‌యించారు. దీంతో ప్ర‌తి ఒక్క‌రినీ ఆయ‌న ముందుండి న‌డిపించేం దుకు రెడీ అయ్యారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఎంపీలు కూడా ఈ కార్య‌క్ర‌మాన్ని సీరియ‌స్‌గా తీసుకోవా లని.. జ‌గ‌న్ ఇప్ప‌టికే ఆదేశించారు. దీంతో జిల్లాలు.. నియోజ‌క‌వ‌ర్గాలు.. మండల స్థాయిలో నాయ‌కులు ముందుకు క‌దులుతున్నారు. కానీ, ఇప్పుడు వ‌స్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య ఏంటంటే.. ఎవ‌రికి వారు.. ఖ‌ర్చుల పై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు శ్రీకాకుళం.. రాయ‌ల‌సీమ.. వంటి ప్రాంతాల నుంచి విజ‌య వాడ‌కు కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకురావ‌డం అంటే.. మాట‌లు కాదు.

కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకురావ‌డం.. వారికి వ‌స‌తి ఏర్పాటు, ప్ర‌యాణ ఖ‌ర్చులు.. ఇలా.. అనేక విష‌యాల్లో భారీ గా త‌మ చేతి చ‌మురు వ‌దులుతుంద‌ని.. నాయ‌కులు , మంత్రులు.. అంచ‌నా వేస్తున్నారు. వాస్త‌వానికి ఇప్పటికే.. రెండు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. దీంతో నాయ‌కులు బాగానే ఖ‌ర్చు పెట్టాల్సి వ‌చ్చింది. అదేవిధంగా.. మంత్రులు నిర్వ‌హించిన‌.. బీసీ యాత్ర‌.. కూడా.. విజ‌యవంతం చేసేందుకు.. స‌భ‌లు నిర్వ‌హించేందుకు క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు బాగానే చేతి చ‌మురు వ‌దిలించుకున్నారు.

దీంతో ఇప్పుడు ప్లీన‌రీ విష‌యానికి వ‌స్తే.. మాత్రం ఇక‌, త‌మ వ‌ల్ల‌కాదంటూ.. చేతులు ఎత్తేస్తున్నారు. అంతేకాదు.. మేం తీసుకువెళ్తాం.. మీ ఖ‌ర్చులు మీరే పెట్టుకోండి.. అని నాయ‌కులు తెగేసి చెబుతున్నారు.

మ‌రోవైపు.. కొంద‌రు నాయ‌కులు.. విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసేందుకు అవ‌కాశం లేద‌ని.. ముందుగానే సంకేతాలు ఇస్తున్నారు. దీనికితోడు వ‌ర్షాల సీజ‌న్ కావ‌డంతో.. కార్య‌క‌ర్త‌లు కూడా ప‌నులకు వెళ్లిపోతున్నా రు.. త‌ప్ప‌.. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చేలా లేర‌ని .. మ‌రో టాక్ న‌డుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.