Begin typing your search above and press return to search.

హైదరాబాద్ శివారులో విల్లా రేటుకు ఆ ఐల్యాండ్ సొంతం చేసుకోవచ్చు

By:  Tupaki Desk   |   19 Jan 2023 1:30 AM GMT
హైదరాబాద్ శివారులో విల్లా రేటుకు ఆ ఐల్యాండ్ సొంతం చేసుకోవచ్చు
X
హైదరాబాద్ మహానగర శివారులో ఒక విల్లా ధర ఎంత ఉంటుంది? అదే సైబర్ సిటీలో అయితే? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే.. హైదరాబాద్ శివారులోని ఒక మోస్తరు విల్లా ధర రూ.2 కోట్ల వరకు ఉంటే.. విలాసవంతమైన విల్లా అయితే మూడున్నర కోట్ల రూపాయిల ధర పలుకుతోంది.

అదే.. సైబర్ సిటీ (ఫైనాన్షియల్ డిస్ట్రిక్)లో అయితే కనీసం రూ.3 కోట్లకు తక్కువకు రాని పరిస్థితి. హైదరాబాద్ లోని ఒక విల్లా ధరకు.. ఒక ద్వీపాన్నే సొంతం చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ ఈ ద్వీపం ఎక్కడ ఉంది? దాని ధర ఎంత? అన్న విషయాల్లోకి వెళితే..

అమెరికాలోని నికరాగువా దేశంలోని బ్లూఫీల్డ్స్ అనే ప్రాంతం నుంచి 19.5 కిలోమీటర్ల దూరంలోఉంది "ఇగువానా ఐలాండ్" సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంలోకొబ్బరి.. అరటి చెట్ల మధ్య మూడు గదుల విలాసవంతమైన ఇల్లు ఉంది. అన్ని సౌకర్యాలున్న ఈ ఇంట్లో పని వాళ్ల కోసం కూడా ప్రత్యేకంగా కొన్ని గదులు ఉండటం గమనార్హం.

ఈ విలాసవంతమైన విల్లాలో హాల్.. కిచెన్.. బార్.. లివింగ్ ఏరియా ఉంది. ఇంటి బయట స్విమ్మింగ్ పూల్.. ఫిష్ డాక్ ఏర్పాట్లు ఉన్నాయి. ద్వీపానికి చుట్టూ నేచర్ ను వీక్షించేందుకు 28అడుగుల వాచ్ టవర్ కూడా ఉంది. వైఫై.. టీవీ.. ఫోన్ లాంటివి కూడా అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇన్ని చెబుతున్నారు?

ఇంతకీ ఈ ఐల్యాండ్ ధర ఎంత? అన్న విషయంలోకి వెళితే.. 475 వేల డాలర్లుగా చెబుతున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.3.87 కోట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ఐల్యాండ్ సేల్ కు సంబంధించిన వివరాలు ఒక వెబ్ సైట్ లో పేర్కొన్నారు. "ప్రైవేటు ఐలాండ్ ఆన్ లైన్" అనే సైట్ లోకి వెళ్లి నికరాగువా ప్రాంతంపై క్లిక్ చేస్తే.. ఈ ఐల్యాండ్ అమ్మకానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. అయితే.. ఇందులోని విశ్వసనీయతపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.