Begin typing your search above and press return to search.

సినిమాల్లో ఏ హీరో హీరోయిన్లు చేయని ఘాటు రొమాన్సు రోడ్డు మీదనే

By:  Tupaki Desk   |   23 April 2022 3:56 AM GMT
సినిమాల్లో ఏ హీరో హీరోయిన్లు చేయని ఘాటు రొమాన్సు రోడ్డు మీదనే
X
వైరల్ గా మారిన ఈ వీడియో చూసినంతనే రెండు షాకులు తగలక మానదు. వీడియోచూస్తున్నంత సేపు వారి ఘాటు రొమాన్సు కంటే కూడా.. ఆ జంట ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటారేమో అన్న భావనతో గుండె వేగంగా కొట్టుకోవటం ఖాయం. ఈ వీడియో చూశాక.. పోయే కాలం కాకుంటే నడి రోడ్డు మీద ఈ దరిద్రం ఏంది? అనుకోకుండా ఉండలేరు.

వైరల్ గా మారిన ఈ వీడియోను చూసినోళ్లంతా తిట్టిపోస్తున్నారు. ఇంతకూ అసలేంజరిగిందంటే.. కర్ణాటకలోని ఒక ప్రేమ జంట రెచ్చిపోయింది. వేగంగా వెళ్లే బైక్ ను నడుపుతున్న ప్రియుడ్ని.. ఘాటుగా హత్తుకొని.. ముద్దులు పెట్టుకుంటూ వెళుతున్న వైనంతో ముక్కున వేలేసుకునే పరిస్థితి.

రోడ్డు మీద ఎదురుగా వస్తున్న వాహనాల్ని పట్టించుకుంటున్నారా? అన్న సందేహం కలిగేలా వారి బైక్ రైడ్ సాగింది. తాము రోడ్డు మీద ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయినట్లుగా.. ఎదురుగా వచ్చే వాహనాల్ని పట్టించుకోకుండా సాగుతున్న వారి బైక్ రైడ్ చూసినోళ్లంతా అవాక్కు అవుతున్నారు.

పల్సర్ బైక్ ట్యాంక్ మీద ప్రియురాలిని కూర్చోబెట్టుకొని.. ఆమె రెండు కాళ్లను ప్రియుడితో లాక్ చేసి.. బలంగా హగ్ చేసుకోవటంతో పాటు.. ఏదైనా అపాయం ఎదురవుతుందో అన్నది కూడా పట్టకుండా దూసుకెళ్లారు. వారి ప్రయాణంలో ఒక లారీ.. బస్సు.. అంబులెన్సులు లాంటి పెద్ద వాహనాలు ఎదురు రావటం.. వాటిని తప్పించుకొని వెళ్లిన బైక్ రైడ్ టెన్షన్ పుట్టించకమానదు.

ఈ బైక్ వెనుక వస్తున్న ఒక వ్యక్తి వీడియో తీయటంతో.. రోడ్డు మీద సాగిన వీరి అరాచక ప్రేమ ప్రయాణం వీడియో రూపంలో మారి.. కోట్లాది మందికి షాకిస్తోంది. ఇలాంటి వారికి గట్టిగా కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.