Begin typing your search above and press return to search.

రూ.788కి గూగుల్ ను కొనేశాడు

By:  Tupaki Desk   |   2 Oct 2015 10:49 AM GMT
రూ.788కి గూగుల్ ను కొనేశాడు
X
షాక్ తిన్నారా... గూగుల్ ను కొనేయడమేంటి.. అదీ 788 రూపాయలకేనా.. మనకు తెలిస్తే మనమూ కొనేసేవాళ్లం కదా అనుకుంటున్నారా...? అయితే... మీరు ఆ ఛాన్సు మిస్సయినట్లే. ఇండియాకే చెందిన సన్మయ్ వేద్ కు ఆ అవకాశం దొరికింది.. అయితే... అది నిమిషం పాటే. ఆ తరువాత గూగుల్ ఆ డీల్ క్యాన్సిల్ చేసుకుంది. కన్ఫ్యూజింగ్ గా ఉన్న ఈ కథంతా తెలియాలంటే మొత్తం చదవాల్సిందే.

ఇండియాకు చెందిన సన్మయ్ వేద్ గూగుల్ మాజీ ఉద్యోగి. ఆయన రీసెంట్ గా ఒక రోజు ల్యాప్ టాప్ ముందు కూర్చుని మంచి డొమైన్లు దొరుకుతాయేమోనని వెతుకుతున్నారు. గూగుల్ వెబ్ సైట్ బయ్యింగ్ సర్వీసైన గూగుల్ డొమైన్లలో ఆయన తాను కోరుకున్న పేర్లు కొడుతూ వెతుకుతుండగా అనుకోకుండా అందులో గూగుల్.కామ్ అని కొట్టారు... ''అవైలబుల్'' అని కనిపించింది. అంతే... ఒక్క క్షణం వేద్ ఆశ్చర్యపోయాడు. ఏదో పొరపాటు జరిగింది అని అర్థమవుతున్నా సరే చూద్దాం దీని సంగతేంటో అనకుంటూ ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ వెళ్తున్నాడు. 12 డాలర్లకు కొనుక్కోవచ్చని వచ్చింది. అంటే మన రూపాయల్లో సుమారు 788 అన్న మాట. ఆన్ లైన్ లో ఆ డబ్బులు చెల్లించేశాడు. ఆ వెంటనే ''యూ బాట్ ఎ డొమైన్'' అని రావాలి.. కానీ అందుకు భిన్నంగా గూగుల్.కామ్ నుంచి ఆయనకు మెసేజిలు, ఈమెయిల్స్ వచ్చిపడ్డాయి. వేద్ దాన్నుంచి బయటకొచ్చేసి తాను కొనుగోలు చేస్తున్నప్పుడు తీసుకున్న స్క్రీన్ షాట్సన్నీ తన లింక్డ్ ఇన్ అకౌంట్ లో పెట్టి జరిగిందంతా రాశాడు.

.... ఆ తరువాత గూగుల్ సెక్యూరిటీ టీంకు జరిగిన కథంతా వివరంగా మెయిల్ చేశాడు. దాంతో వారు జరిగిన పొరపాటును గుర్తించి డీల్ క్యాన్సిల్ చేసి వేద్ చెల్లించిన డబ్బు రిటర్న్ చేశారు. వేద్ మంచోడు కాబట్టి లీగల్ గా ప్రొసీడవ్వలేదు. లేకుంటే గూగుల్ సైట్ నుంచే అఫీషియల్ గా గూగుల్.కామ్ డొమైన్ కొనుక్కున్నందుకు కోట్లు డిమాండ్ చేసే అవకాశముండేది. మొత్తానికి మేటర్ సెటిలైనా... వేద్ మాత్రం కొన్ని నిమిషాలపాటు గూగుల్.కామ్ కు ఓనరయ్యాడు.