Begin typing your search above and press return to search.
దేవుడా.. అర్జెంట్ గా ఆ పెద్దనాన్న.. పెద్దమ్మలను ఏమైనా చేసేయ్
By: Tupaki Desk | 29 April 2022 5:30 AM GMTమనసు మొత్తం చేదుగా మారే నెగిటివ్ న్యూస్ లు చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. సున్నిత మనస్కులైతే విపరీతమైన వేదనకు గురవుతారు. మామూలు వారు సైతం.. మన చుట్టూ ఇలాంటోళ్లు ఉన్నారా? అన్న భావన కలిగేలా చేస్తుంది. మరి.. నెగిటివిటీ వద్దనుకున్నప్పుడు.. ఇప్పుడీ వార్త ఎందుకు? అన్న సందేహం రావొచ్చు. ఎంత దారుణమైన విషయాలైనా కొన్నింటిని తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే.. మన చుట్టూ ఉంటూ మామూలుగానే ఉంటూ ఎంత అమానుషంగా వ్యవహరిస్తారన్న విషయంపై అవగాహన ఉండటం చాలా అవసరం. అప్పుడే ఈ తరహా తోడేళ్ల బారిన పడకుండా ఉండే వీలుంటుంది.
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ నిక్రష్ట ఘటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదంతా చదివిన తర్వాత.. దేవుడా.. ఇలాంటోళ్లను ఇంకా ఎందుకు బతికే ఉంచావ్? అంటూ గట్టిగా నిలదీయాలనిపిస్తుంది. నిజామాబాద్ లో ఒక జంట కాపురం ఉంటోంది.
భర్త వయసు 61 ఏళ్లు అయితే.. భార్య వయసు ఆరేడేళ్లు తక్కువగా ఉంటుంది. ఈ 61 ఏళ్ల దరిద్రుడికి సోదరుడు ఉన్నాడు. అతడు.. అతని భార్య ఎనిమిదేళ్ల క్రితం మరణించారు. వారికి ఇద్దరు కుమార్తెలు. ఒకరి వయసు 14 ఏళ్లు కాగా.. మరొకరిది రెండేళ్లు. తల్లిదండ్రుల్ని కోల్పోవటంతో పెద్దమ్మాయి మానసిక వైకల్యానికి గురైంది.
ఆ ఇద్దరిని నిజామాబాద్ లో ఉండే పెద్దమ్మ.. పెద్దనాన్నలు తెచ్చుకొని వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఇప్పుడు పెద్దమ్మాయికి 22 ఏళ్లు.. చిన్నమ్మాయికి పదేళ్లు. యువతిని కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకోవాల్సిన పెద్దమ్మ దారుణానికి ఒడికట్టింది. మానసికంగా సరిగా లేని అమ్మాయిని.. సమీపాన ఉన్న 56 ఏళ్ల ఏఆర్ కానిస్టేబుల్ చంద్రకాంత్ నుంచి డబ్బులు ఆశించి.. అమ్మాయిని అతడికి అప్పజెప్పింది.
భార్య ఇంట్లో లేని వేళలో పెద్దనాన్న కూడా ఆమె మీద అత్యాచారానికి పాల్పడేవాడు. తాజాగా ఆమె ఎనిమిది నెలలగర్భవతి కావటం.. అక్కకు జరుగుతున్న దారుణాల గురించి చెల్లెలు బయటపెట్టటంతో వీరి దారుణాలు బయటకు వచ్చాయి. ఇలాంటోళ్లను ఏం చేసినా తక్కువే అవుతుంది. ఇప్పుడు చెప్పండి.. ఇదంతా చదివిన తర్వాత ఈ పెద్దమ్మ.. పెద్దనాన్నలను దేవుడు వెంటనే శిక్షించాలనుకోవటం తప్పేం కాదుగా?