Begin typing your search above and press return to search.

బెంగాల్లో బీజేపీ పై రైతుఉద్యమ ప్రభావం ?

By:  Tupaki Desk   |   3 March 2021 4:30 PM GMT
బెంగాల్లో బీజేపీ పై రైతుఉద్యమ ప్రభావం ?
X
పశ్చిమబెంగాల్లో బీజేపీ గెలుపవకాశాలపై రైతుఉద్యమం దెబ్బ పడబోతోందా ? తాజాగా సంయుక్త కిసాన్ మోర్చా ఇఛ్చిన పిలుపు చూస్తే అలాగే ఉంది. కేంద్రం రూపొందించిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గడచిన మూడు నెలలకు పైగా ఢిల్లీ శివార్లలో ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇఫ్పటికే ఉద్యమాలు యావత్ దేశంలో సంచలనంగా మారింది.

ఉద్యమాన్ని విరమింపచేయటంలో కేంద్రం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో ఏమి చేయాలో తెలీక కేంద్రం చేతులెత్తేసింది. దాంతో పంజాబ్ లో మొదలైన ఉద్యమం ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, కర్నాటక, రాజస్ధాన్ తదితర రాష్ట్రాలకు పాకుతోంది. ఉద్యమ ప్రభావం తొందరలోనే బీజేపీ పడబోతోంది. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా తీర్మానించింది.

తమిళనాడు, కేరళలో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎలాగు లేదు కాబట్టి తమ దృష్టంతా పశ్చిమబెంగాల్ మీదే కేంద్రీకరించినట్లు మోర్చా నేత బల్బీర్ సింగ్ స్పష్టంగా ప్రకటించారు. తొందరలోనే రైతుఉద్యమకారులు బెంగాల్లో పర్యటించబోతున్నట్లు చెప్పారు. తమ పర్యటనల్లో ఎవరికి ఓట్లేయాలనే విషయంలో తాము చెప్పేదేమీ ఉండదని కాకపోతే బీజేపీకి మాత్రం ఓట్లేయద్దని ప్రచారం చేస్తామన్నారు.

మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా రైతాంగం ఓట్లే కీలకంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. తాజా పరిణామాల్లో బెంగాల్లో కూడా రైతుల ఓట్లే చాలా కీలకంగా ఉండబోతోంది. ఇటువంటి నేపద్యంలో బీజేపీకి వ్యతిరేకంగా రైతు సంఘాలు చేయబోతున్న ప్రచారంతో కమలనాదులకు ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఒకవైపు మమతాబెనర్జీని ఓడించాలని నరేంద్రమోడి, అమిత్ ధ్వయం చేస్తున్న ప్రయత్నాలకు రైతుసంఘాలే అడ్డుకునేట్లుంది. చూడాలి చివరకు ఏమవుతుందో.