Begin typing your search above and press return to search.

తారకరత్న మృతి ప్రభావం...సాయిరెడ్డి మీద గట్టిగానే...?

By:  Tupaki Desk   |   23 Feb 2023 7:21 PM GMT
తారకరత్న మృతి ప్రభావం...సాయిరెడ్డి మీద గట్టిగానే...?
X
సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నందమూరి  తారకరత్న ఇటీవల కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను దగ్గరుండి మరీ జరిపించారు వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి. దానికి కారణం తారకరత్న ఆయన బంధువు కావడమే. తన భార్య సోదరి అల్లుడు తారకరత్న కావడంతో ఆయన బాధ్యత అంతా భుజానికెత్తుకున్నారు. ఆ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ అధినేతతో కూడా పక్క పక్కనే కూర్చోవాల్సి వచ్చింది.

అలాగే నందమూరి  బాలయ్యతో కలసిమెలసి ఉండాల్సి వచ్చింది. అది అతి పెద్ద విషాదం కాబట్టి బంధువులుగా అంతా ఒక్క చోట ఉండడాన్ని ఎవరూ పట్టించుకోరు. ఇది ఒక అంశంగా చూసుకుంటే వైసీపీకి ఇది వింతగా కనిపించవచ్చు. వైసీపీ హై కమాండ్  కి  తన రాజకీయ ప్రత్యర్ధులు అంతా ఎప్పటికీ అలాగే ఉంటారు. పార్టీలో  అందరికీ అలాగే కనిపించాలి.

ఇక ఈ విషయంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీద పార్టీ లుక్ లో  కొంత తేడా కనిపించిందని అంటున్నారు. దీని ఫలితం కూడా వెంటనే వచ్చేసింది. అదెలా అంటే వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నెట్‌వర్క్‌ను అట్టడుగు స్థాయిలో బలోపేతం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జిల్లా స్థాయిలో పార్టీ అనుబంధ సంస్థలను తాజాగా  ప్రకటించింది.

అందులో యువత, రైతులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విద్యార్థులు, ట్రేడ్ యూనియన్, వాణిజ్యం, సాంస్కృతిక, పబ్లిసిటీ, నేత కార్మికులు, వైద్యులు, ఐటీ, వికలాంగులు - సేవాదళ్ మరియు గ్రీవెన్స్ సెల్‌తో పాటు వివిధ విభాగాల అధ్యక్షులను పార్టీ ప్రకటించింది.ఇలా అన్ని జిల్లా స్థాయి పార్టీ అనుబంధ విభాగాల నియామకంపై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర సమన్వయకర్తగా పేర్కొనడమే ఇపుడు అసలైన వింత

ఎందుకంటే ఇప్పటిదాకా ఈ కో ఆర్డినేటర్ పదవిలో విజయసాయిరెడ్డి ఉన్నారు. పైగా విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడు. ఆయన వైసీపీలో అత్యంత కీలకంగా ఉన్నారు. ఆయన్ని ఈ ముఖ్యమైన పదవిలో గత ఏడాది ఫిబ్రవరిలో వైసీపీ అధినాయకత్వం నియమించింది.

అప్పట్లో ఆయనకు కో ఇంచార్జిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమించారు. అలా నిన్నటిదాకా ఉన్న చెవిరెడ్డి ఇపుడు ఏకంగా విజయసాయిరెడ్డి పోస్టులోకి వచ్చేశారు. అంటే ఎక్కడో తేడా కొడుతోంది అని అంటున్నారు. ఇలా చెప్పా పెట్టకుండా విజయసాయిరెడ్డిని ఈ పదవి నుంచి తొలగించడం అంటే ఒక విధంగా బ్రేకింగ్ న్యూస్ గానే చూడాలని అంటున్నారు.

ఇక విజయసాయిరెడ్డి వైఖరి కూడా గత కొన్ని రోజులుగా మారిందని అంటున్నారు. దాన్ని వైసీపీ రెబెల్ ఎంపీ రాజు గారు కనిపెట్టేశారు అంటే వైసీపీ హై కమాండ్ కనిపెట్టలేదా. సో ఆ విధంగా చూస్తే విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్ కి హీట్ తగ్గించేశారు. చాలా దీసెంట్ గానే ఆయన వ్యవహరిస్తున్నారు.

ఆయన గతంలో మదిరిగా చంద్రబాబు మీద లోకేష్ మీద విరుచుకుపడడంలేదు. ఇక మరో విషయం ఏంటి అంటే ఆయన ఢిల్లీ పెద్దలతో అక్కడ ఉన్న అధికార కేంద్రాలతో చాలా క్లోజ్ రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆయనకు రాజ్యసభకు ప్యానెల్ ఛైర్మన్‌గా పదవి దక్కిందని, ఆ మీద ట లేటెస్ట్ గా సంసద్ రత్న అవార్డుతో సత్కరించిన విధానం నుండి చూస్తే వైసీపీ హై కమాండ్ కి పూర్తి క్లారిటీ వచ్చిందని అంటున్నారు.

మొత్తానికి చూస్తే విజయసాయిరెడ్డిని వైసీపీ ప్రెసిడెంట్, సీఎం అయిన జగన్ ఇక మీదట పూర్తి ప్రాధాన్యత ఇచ్చి పట్టించుకుంటారా అన్నదే ఒక కీలకమైన చర్చ. ఇక్కడ మరో ప్రచారం కూడా సాగుతోంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకత్వంలో మార్పు కూడా వచ్చినా రావచ్చు అని అది కూడా తొందరలో తేలుతుందని అంటున్నారు. మొత్తానికి తారకరత్న మృతి ప్రభావం సాయిరెడ్డి పొలిటికల్ కెరీర్ మీద గట్టిగానే పడిందా అంటే జవాబు ఎవరిని వారు చెప్పుకోవాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.