Begin typing your search above and press return to search.

భార్యను అమ్మేసి స్మార్ట్ ఫోన్ కోన్న భర్త !

By:  Tupaki Desk   |   24 Oct 2021 2:30 AM GMT
భార్యను అమ్మేసి స్మార్ట్ ఫోన్ కోన్న భర్త !
X
ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు పెళ్లి అయిన నెల తర్వాత భార్యను రాజస్థాన్ వ్యక్తికి విక్రయించి,ఆ డబ్బుతో స్మార్ట్‌ఫోన్ కొన్న ఉదంతం దేశంలో సంచలనం రేపింది. స్మార్ట్ ఫోన్, జల్సా కోసం ఖర్చులకుమ డబ్బులు సంపాదనే లక్ష్యంగా ఓ యువకుడు దారుణాకి ఒడికట్టాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన 17ఏళ్ల యువకుడు.. 26ఏళ్ల వయస్సు ఉన్న తన భార్యను 55ఏళ్ల వ్యక్తికి పెళ్లైన నెల రోజులకే అమ్మేశాడు. భార్యను రాజస్థాన్ వ్యక్తికి విక్రయించి, ఆ డబ్బుతో స్మార్ట్‌ ఫోన్ కొన్నాడు.

మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఆగ్నేయ రాజస్థాన్ జిల్లా బారన్ నుంచి 26 ఏళ్ల మహిళను రక్షించిన పోలీసులు.. యువకుడిని కటకటాల్లోకి పంపించారు. యువకుడు పెళ్లి తర్వాత నెలరోజులకు భార్యతో కలిసి ఇటుకబట్టిలో పనిచేసేందుకు రాజస్తాన్ వెళ్లారు. భార్యను విక్రయించగా వచ్చిన డబ్బుతో స్మార్ట్ ఫోన్ కొన్న యువకుడు డబ్బును జల్సాలకు ఖర్చుపెట్టి తిరిగి స్వగ్రామానికి వచ్చాడు.

యువకుడి భార్య గురించి కుటుంబసభ్యులు అడిగితే, ఆమె తనను వదిలేసిందని చెప్పారు. యువకుడి మాట నమ్మని మహిళ కుటుంబసభ్యులు బలంగీర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కాల్ రికార్డులను పరిశీలించి, ఆమెను గుర్తించారు.

అక్కడి నుంచి ఆమెను తీసుకుని వచ్చారు. యువకుడి భార్య గురించి ఆమె కుటుంబసభ్యులు అడిగితే, ఆమె తనను విడిచిపెట్టిందని చెప్పాడు. యువకుడి మాట నమ్మని మహిళ కుటుంబసభ్యులు బలంగీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి కాల్ రికార్డులు పరిశీలించిన పోలీసులకు తీగ లాగితే డొంక కదిలినట్లు భార్యను విక్రయించాడని తేలింది. ముందు తాను కొన్న మహిళను విడిచిపెట్టనని రాజస్థాన్ వ్యక్తి చెప్పాడు.దీంతో బలంగీర్ పోలీసులు భర్త విక్రయించిన భార్యను అతి కష్టం మీద పట్టుకువచ్చారు. తాను రూ.1.8 లక్షలు ఇచ్చి మహిళను కొన్నానని బారన్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి చెప్పాడు. అనంతరం భార్యను విక్రయించిన భర్త అయిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు.