Begin typing your search above and press return to search.

ఏడాదిగా టాయిలెట్ ‌లోనే భార్యను బంధించిన భర్త .... ఎందుకంటే !

By:  Tupaki Desk   |   15 Oct 2020 12:10 PM GMT
ఏడాదిగా టాయిలెట్ ‌లోనే భార్యను బంధించిన భర్త .... ఎందుకంటే !
X
హరియాణాలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను ఏడాదిగా టాయిలెట్ లో బంధించిన భర్త ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పానిపట్ జిల్లా రిష్పూర్‌ గ్రామంలో జరిగింది. స్థానికులు మహిళ, శిశు సంరక్షణ అధికారులకు సమాచారం అందించడంతో ఆమెను కాపాడారు. ఏడాది పాటు పాయిఖానాలో బందీగా ఉన్న ఆమె పరిస్థితిని చూసి అధికారులు సైతం చలించిపోయారు. బలహీనంగా ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

దీనిపై మహిళా అధికారి మాట్లాడుతూ.. టాయిలెట్ ‌లో ఏడాదిగా ఓ మహిళను బంధించి ఉంచినట్టు సమాచారం అందింది. మా బృందంతో కలిసి గ్రామానికి చేరుకోగా ఆమెను నిజంగానే బంధించి ఉంచారు. గత కొద్ది రోజులుగా బాధితురాలు ఎటువంటి ఆహారం తీసుకోలేదు అని అన్నారు. ఆమెకు మతిస్థిమితం లేదని చెబుతున్నారు. కానీ, అది నిజం కాదు ఆమెతో మాట్లాడినప్పుడు సాధారణంగా ఉందన్నారు. అయితే, ఆమె మతిస్థిమితం కోల్పోయిందా, కాదా, అన్నది అప్రస్తుతం కానీ ఆమెను టాయిలెట్‌ లో బంధించారు అని అన్నారు. ఆమెను బయటకు తీసుకొచ్చి, స్నానం చేయించామని తెలిపారు.

బాధితురాలి భర్త మాత్రం ఆమె మానసిక పరిస్థితి బాగులేదని, బయటకు రమ్మని చెప్పినా అందులోనే ఉంటోందని చెప్పాడు. వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయిందని, ఏడాది కాలంగా బాధితురాలి భర్త నరేశ్ ఆమెను టాయిలెట్ ‌లోనే ఉంచి బయటకు రాకుండా తాళం వేశాడని, దీని గురించి తెలియడంతో మహిళా సంక్షేమ విభాగం అధికారి వెళ్లి విడిపించారని పోలీస్ అధికారులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని, తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధితురాలి మానసిక పరిస్థితి గురించి వైద్యుల సలహా ప్రకారం ముందుకెళ్తామన్నారు.