Begin typing your search above and press return to search.
భార్య కోసం కిడ్నీ ఇచ్చేసిన భర్త.. ఈ కఫుల్ గురించి తెలుసుకోవాల్సిందే
By: Tupaki Desk | 16 Feb 2021 1:30 PM GMTపరాయి వ్యక్తి మోజులో పడి.. ఏళ్లకు ఏళ్లుగా కలిసి కాపురం చేస్తున్న భర్తల్ని చంపుతున్న భార్యలు.. భార్యల్ని చంపేస్తున్న భర్తలు ఉన్నపాడు కాలమిది. బంధాలు.. అనుబంధాల మీద కొత్త సందేహాలు కలిగేలా చేస్తున్న ఉదంతాలు ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. అందుకు భిన్నంగా ఇప్పుడో జంట ఉదంతం బయటకు వచ్చింది. జీవిత భాగస్వాములు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ జంట గురించి వింటే.. బాలీవుడ్ మూవీకి ఏ మాత్రం తగ్గని స్టోరీగా చెప్పాలి.
అహ్మదాబాద్ కు చెందిన వినోద్.. రీటాలకు 23 ఏళ్ల క్రితం పెళ్లైంది. అన్యోన్య దాంపత్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఈ జంటపై విధి ఒక సవాలు విసిరింది. మూడేళ్లుగా రీటా కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆమె పడుతున్న అవస్థల్ని చూడలేని వినోద్.. ఆమెకు తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అనూహ్యంగా ఆయన కిడ్నీ ఆమెకు సరిపోతుందని వైద్యులు తేల్చారు.
తన కోసం భర్త కిడ్నీ ఇవ్వటాన్ని రీటా అస్సలు ఒప్పుకోలేదు. దీంతో.. వినోద్ ఆమెను ఒప్పించారు. బతికి ఉన్నంత కాలం ఇద్దరు కలిసి బతుకుదామని చెప్పి ఆమె ఓకే అనేలా చేశాడు. చివరకు ఇరువురి అనుమతితో ఫిబ్రవరి 14న వారికి ఆపరేషన్ చేశారు. వినోద్ కిడ్నీని రీటాకు అమర్చారు. ప్రేమజంటకు మించినట్లుగా ఉండే ఈ జంట పెళ్లి రోజునే ఆపరేషన్ జరగటం.. అది కాస్తా సక్సెస్ కావటంతో అంతా హ్యాపీ. ప్రేమికుల దినోత్సవం రోజునే ఇదంతా జరగటం మరో విశేషంగా చెప్పాలి.