Begin typing your search above and press return to search.

భర్త మెడలో కుక్క చైను కట్టి రోడ్ల వెంట తిప్పింది

By:  Tupaki Desk   |   15 Jan 2021 9:30 AM GMT
భర్త మెడలో కుక్క చైను కట్టి రోడ్ల వెంట తిప్పింది
X
సిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కావాలని చేశారో.. రోటీన్ కు భిన్నంగా ఉండాలనుకున్నారో.. కరోనా వేళ విధించి.. కర్ఫ్యూ నిబంధనల్ని ఎక్కెసం చేయాలనుకున్నారో కానీ కెనాడలోని క్యూబెక్ లో చోటు చేసుకున్న ఉదంతం గురించి తెలిసినోళ్లంతా తిట్టి పోస్తున్నారు. ఇదేం పోయేకాలమని మండిపడుతున్నా వారు లేకపోలేదు. విస్మయానికి గురి చేసేలా ఉన్న ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే..

క్యుబెక్ పట్టణానికి చెందిన ఒక మహిళ.. తన భర్త మెడకు కుక్క గొలుసుకట్టింది. వీధుల్లోకి షికారుకు వచ్చింది. ఈ ఉదంతం సంచలనంగా మారింది. నెటిజన్లు అయితే.. ఈ అంశం మీద తీవ్రంగా స్పందిస్తుననారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్న వేళ.. యూకే.. ఫ్రాన్స్ లాంటి దేశాలు లాక్ డౌన్ వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని దేశాల్లో రాత్ర వేళలో కర్ఫ్యూను విధిస్తున్నారు.

కెనడాలోనూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ నెలకొంది. ఈ సమయంలో.. ఎవరైనా సరే.. తమ కుక్కలతో మాత్రమే రోడ్ల మీదకు రావొచ్చొని మినహాయింపు ఇచ్చారు. రాత్రి ఎనిమిది దాటిన తర్వాత గుంపులుగా వెళ్లకూడదని.. రోడ్ల మీద ఒక్కరుగా మాత్రమే ప్రయాణించాలన్న కండీషన్ పెట్టారు. ఇలా ప్రయాణించే వేళ.. తమ పెంపుడు కుక్కతో వీధుల్లోకి రావొచ్చన్న అవకాశాన్ని ఇచ్చారు.

అధికారులు పేర్కొన్న నిబంధనల్ని తమకు తగ్గట్లు అర్థం చేసుకున్న ఒక జంట షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. తన భర్త మెడలో కుక్కు చైను వేసి.. సదరు భార్యామణి వీధుల్లోకి వచ్చింది. భార్య వెంట.. కుక్కలా నడవటానికి సదరు భర్తగారు పడిన అవస్థలు అన్ని ఇన్ని కావు. అంతలోనే.. ఈ సిత్రాన్ని గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇదేం పని అని ప్రశ్నిస్తే.. నిబంధనను ప్రస్తావించి..మీరే చెప్పారు కదా? అని ‘పెంపుడు కుక్క’కు ఉన్న మినహాయింపును ప్రస్తావించారు. దీంతో.. కాలిపోయిన పోలీసులు ఒక్కొక్కరికి 1500 డాలర్ల చొప్పున 3వేల డాలర్ల జరిమానాను విధించారు. ఈ ఉదంతం వైరల్ గా మారింది. దీనిపై సదరు మహిళపై పలువురు విరుచుకుపడుతుంటే.. ఇద్దరిని కలిసి తిట్టిపోస్తున్నోళ్లు కూడా తక్కువేం కాదు.