Begin typing your search above and press return to search.
ఆఫీస్ పని అని చెప్పి భర్త మరో పెళ్లికి రెడీ.. ఫాలో అయి మరీ రట్టు చేసిన భార్య
By: Tupaki Desk | 27 March 2023 10:09 PM GMTఆఫీస్ పని అని చెప్పిన భర్త ఊరు వెళ్లాడు. కానీ భార్యకు అనుమానం వచ్చింది. మూడు రోజులు తర్వాత వస్తానంటూ బయలు దేరిన భర్త చేష్టలను భార్య అనుమానించింది. లగేజీ కొత్త బట్టలు పట్టుకెళ్లుతుండడంతో అనుమానించిన భార్య భర్త ఆఫీసులో ఆరాతీసింది. భర్త మూడు రోజులు లీవ్ పెట్టాడని తెలుసుకొని అతడిని ఫాలో అయ్యింది. కారులో వెళుతూ ఓ కళ్యాణ మండపానికి చేరుకున్న భర్తను ఫాలో అవుతూ లోపలికి వెళ్లింది. అక్కడ చూసి షాక్ అయ్యింది.
తన కుమారుడితో కలిసి ఈ మహిళ చేసిన పని ఇప్పుడు వైరల్ అయ్యింది. తన భర్త తనకు తెలియకుండా పెళ్లికి ఎందుకు వెళ్లాడని అనుమానించి లోపలికి వెళ్లిన భార్యకు అక్కడ ఓ ప్లెక్సీ కనిపించింది. అందులో పెళ్లి కుమారుడిగా భర్త ఉండడం చూసి షాక్ అయ్యింది. లోపలికి వెళ్లి పెళ్లికొడుకు తన భర్త అని చెప్పి అమ్మాయి తరుఫు వారికి జరిగిందంతా చెప్పేసింది. అయితే అక్కడున్న వారు నమ్మకపోవడంతో ఫోన్లో తమ పెళ్లి ఫొటోలు చూపించారు. 2014,. అక్టోబర్ 10 పెళ్లి జరిగినట్టు చూపించడంతో వధువు కుటుంబ సభ్యులు గదిలోకి తీసుకెళ్లి మరీ వివరాలు తెలుసుకున్నారు.
షాకైన వధువు కుటుంబ సభ్యులు పెళ్లికొడుకునే చితకబాదారు. అతడికి ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నట్టు తేలడంతో ఆగ్రహంతో దాడి చేశఆరు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
పోలీసులు వచ్చి పెళ్లికొడుకును ఆ వధువు బంధువుల నుంచి బయటకు తీసుకెళ్లారు. మంచి సూట్ బూటు వేసుకొని ఉన్న వరుడు చొక్కా, ప్యాంట్ చిరిగిపోయింది. నగ్నంగా అవమానకరరీతిలో బయటకు అతికష్టం మీద ప్రాణభయంతో పోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పెళ్లి హైదరాబాద్ పాతబస్తీలో జరిగినట్టుగా వార్తలు వస్తున్నా.. అసలు ఎక్కడ జరిగిందన్నది మాత్రం తెలియడం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Kalesh B/w Wife and her Husband over 2nd Marriage of Her Husband pic.twitter.com/z3WavXAbi6
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 26, 2023