Begin typing your search above and press return to search.
వందేళ్లనాటి ఉత్తరం బయటకొచ్చింది.. అందులో ఏముందంటే
By: Tupaki Desk | 14 Sep 2020 7:30 AM GMTఉత్తరాలు ఆలస్యంగా చేరుకోవడం మనమే ఎన్నోసార్లు వింటూ ఉంటాం.. మహా అయితే ఓ ఆరు నెలలో, ఏడాదో ఆలస్యంగా చిరునామా కు వెళ్లొచ్చు. కానీ ఓ వ్యక్తి పోస్టుచేసిన ఉత్తరం మాత్రం ఏకంగా వందేళ్ల తర్వాత వెళ్లింది. అది కూడా మెయిల్లో.. ఈ ఉత్తరం కథ ఏమిటో తెలుసుకుందాం.. మిషిగాన్ కు చెందిన బ్రిట్టనీ కీచ్ అనే మహిళ.. తన మెయిల్ చూస్తుండగా ఆమెకు ఓ పోస్ట్‌కార్డు కనపించింది. కార్డు మీద తన ఇంటి చిరునామా కూడా ఉంది. అయితే ఆ కార్డు పై 1920 అక్టోబరు 29 అని ఉన్న పోస్టల్ స్టాంప్ కనిపించింది. దీంతో ఆమె షాక్ తింది. దానిపై ఉన్న పోస్టల్ స్టాంప్ ద్వారా అది జేమ్స్ టౌన్ నుంచి పోస్టు చేసినట్టు ఆమె గుర్తించారు. ఆ కార్డు మీద ప్లోసీ బర్గేస్ అని సంతకం చేసి ఉంది. ఆయన తన తాత బామ్మలకు తన విశేషాలు చెబుతూ ఆ ఉత్తరాన్ని రాశారు. ఆ ఉత్తరంలో చీపురు పట్టుకున్న పిల్లి, మంత్ర గత్తె బొమ్మలు ఉండటం కూడా ఆమె గమనించారు. అయితే ఈ విషయం పై పోస్టల్ శాఖ ఏం చెబుతుందంటే.. ‘చారిత్రక ఉత్తరాలను సేకరించడం కొందరి హాబీ.. వారు అలా కొన్న ఉత్తరాలను సంబంధీకులకు చేర వేస్తుంటారు. ఇది కేవలం ఓ థ్రిల్ కోసం చేసే పని మాత్రమే.
ఇలా సోషల్ మీడియా ద్వారా ఉత్తరాలను అందుకున్నవారు ఎంతోమంది చాలా హ్యాపీగా ఫీలవుతారు. కానీ వందేళ్ల క్రితం పోస్ట్చేసిన ఓ ఉత్తరం ఇప్పడు వెలుగు లోకి రావడం విశేషం. ఇటువంటి ఉత్తరాలు మనకు ఎంతో విజ్ఞానాన్ని పంచుతాయి. అనాటి కాలమాన పరిస్థితులను మనకు తెలియజెప్తాయి.
వాస్తవిక చరిత్రలను సేకరించే వారికి ఇటువంటి ఉత్తరాలు ఎంతో ఉపయోగకరం. పాత ఘటనల ఆధారంగా డాక్యుమెంటరీలు, సినిమాలు తీసే వారికి కూడా ఈ ఉత్తరాలు ఎంతో ఉపయోగ పడతాయి’ అంటూ పోస్టల్ శాఖ వివరణ ఇచ్చింది. ఏది ఏమైనప్పటికీ వందేళ్ల ఉత్తరం.. ఇప్పడు బయటకు రావడం నిజంగా ఓ విశేషమే.