Begin typing your search above and press return to search.

ఇంటి అద్దె నెలకు రూ.1.26 కోట్లు .. ప్రత్యేకత ఏంటంటే , ఎక్కడుంది ?

By:  Tupaki Desk   |   4 March 2021 12:30 PM GMT
ఇంటి అద్దె నెలకు రూ.1.26 కోట్లు .. ప్రత్యేకత ఏంటంటే , ఎక్కడుంది ?
X
ఓ ఇంటికి అద్దె అంటే వేలల్లో ఉంటుంది. ఇక బాగా డబ్బున్న వారు అయితే నెలకి లక్ష నుండి నాలుగైదు లక్షల వరకు అద్దె చెల్లించి ఇంటిని అద్దె కి తీసుకుంటారు. ఇక అంతకంటే ఎక్కువ అద్దె చెల్లించడం కంటే ... ఏకంగా ఇంటినే కొనడం నయం అని చెప్పవచ్చు. అయితే ఓ ఇంటికి నెలకి అద్దె గా రూ.1.26 కోట్లు చెల్లిస్తున్నారు. అసలు అది అద్దా.. లేదా ఇల్లు ఖరీదా అనే డౌట్ వస్తుంది. మరి ఇంత భారీ స్థాయిలో రెంట్ ఉండే ఆ ఇంటి ప్రత్యేకతలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఇంటి అద్దెలు సాధారణంగా వేలల్లో ఉంటాయి. మన ఆర్థిక స్తోమతను బట్టి అద్దె ఇళ్లను సెలక్ట్ చేసుకుంటాం. ఇల్లు అద్దెకు తీసుకునేది ఎక్కువగా మధ్య తరగతి వారే ఎక్కువగా ఉంటారు. ధనవంతులైతే ఏకంగా ఇళ్లు కొనేసుకుంటారు.

కానీ శ్రీమంతులు మాత్రమే అద్దెకు తీసుకునేలా ఉన్న లగ్జరీ హౌస్ హాంగ్‌కాంగ్‌లో ఉంది. రెంట్ రూ.1.26 కోట్లు. 10,804 చదరపు అడుగుల ఇంట్లో ప్రైవేట్ గ్యారేజ్, గార్డెన్, ఎలివేటర్ వంటి సౌకర్యాలు ఆ ఇంట్లో ఉన్నాయి. విక్టోరియా హార్బర్ కు దగ్గరగా ఉండటంతో ఈ ఇంటి అద్దె భారీగా ఉన్నట్టు చెప్తున్నారు. హాంకాంగ్ లోని విక్టోరియా హార్బర్ నుంచి ప్రతిరోజూ కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. నిత్యం వ్యాపారం చేసే వ్యక్తులే ఈ ఇంటిని అద్దెకు తీసుకొని ఉండొచ్చు. సంవత్సరానికి ఈ ఇంటి కోసం రూ.15 కోట్ల రూపాయల అద్దె చెల్లిస్తున్నారట. హాంకాంగ్ మొత్తం మీద ఇదే ఖరీదైన అద్దె ఇల్లు అని చెప్తున్నారు. హాంగ్‌కాంగ్ లెక్కల్లో దీని నెలరోజుల అద్దె 1.35 మిలియన్ హాంగ్‌కాంగ్ డాలర్లు.